ఒక సాధారణ కూలీ కొడుకు నేడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు.. ఈ ముస్తాఫా ఎందరికో ఆదర్శం
అతను ఆరో తరగతి ఫెయిల్. ఇంకేముంది చదువుకు దూరమై పొలంలో తండ్రికి సాయమయ్యాడు. రోజుకు 10 రూపాయలు కూడా సంపాదించలేని పొజీషన్ వాళ్లది. కానీ అతని పట్టుదల నేడు అతన్ని వందల కోట్లకు అధిపతిని చేసింది. ఈ వ్యక్తి కథ మనందరీ ఆదర్శం.
విజయానికి ఒక్కటే మార్గం ఉండదు. విజయం వివిధ రకాలుగా వస్తుంది. కష్టపడి పనిచేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది. జీవితంలో మీరు సాధించాలని కలలు కంటున్న దానిని సాధించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒకప్పుడు 6వ తరగతిలో ఫెయిల్ అయిన ఓ కూలీ కొడుకు జీవితంలో ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కేరళలోని మారుమూల గ్రామానికి చెందిన పీసీ ముస్తఫా స్ఫూర్తిదాయకమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఐడి ఫ్రెష్ ఫుడ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పీ.సీ.ముస్తఫా కేరళలోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించిన ముస్తఫా తన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఇతను 6వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో చదువు మానేసి తండ్రికి పొలం పనుల్లో సాయం చేసాడు. రోజుకు రూ.10 సంపాదించి కుటుంబాన్ని పోషించుకోలేకపోయేవారు. ఆ తర్వాత ముస్తాఫా ఒక టీచర్ సాయంతో ముస్తఫా తిరిగి స్కూల్ కు వెళ్లాడు. ఆ టీచర్ ముస్తాఫా చదువును పూర్తి చేయడానికి ఎంతో సహాయం చేశాడు.
పేదరికం నుంచి బయటపడాలనే బలమైన కోరికతో ముస్తఫా మంచి భవిష్యత్తును సృష్టించడానికి విద్యను ఒక సాధనంగా మార్చుకున్నాడు. చదువు పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసాడు. కానీ తనకు ఇంట్రెస్ట్ ఉన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ లోకి వెళ్లాలని డిసైడ్ చేసుకున్నాడు.
2005 లో ముస్తఫా తన కజిన్స్ తో కలిసి ఐడి ఫ్రెష్ ఫుడ్ ను స్టార్ట్ చేశాడు. ఇది తాజా, రెడీ-టు-కుక్ ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేసి అమ్మే సంస్థ. ప్రారంభంలో వీరికి ఒక చిన్న వంటగది మాత్రమే ఉండదే. స్టార్టింగ్ ఈ సంస్థ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. 50,000 రూపాయల పెట్టుబడితో ముస్తఫా పీసీ ఐడీ ఫ్రెష్ ఫుడ్ తో తన వ్యాపారాన్ని ప్రయాణాన్ని ప్రారంభించాడు, గ్రైండర్, మిక్సర్, తూకం యంత్రంతో కూడిన 50 చదరపు అడుగుల చిన్న వంటగది నుంచి ఈ సంస్థ పనిచేస్తుంది. రోజుకు 100 ప్యాకెట్ల ఆహార ఉత్పత్తులను అమ్మాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి వారికి తొమ్మిది నెలల సమయం పట్టింది. గతంలో5,000 కిలోల బియ్యాన్ని ఉపయోగించి 15,000 కిలోల ఇడ్లీ రవ్వను తయారు చేసేది. ఈ రోజు సంస్థ ఎంతో పాపులర్ అయ్యింది. ఎన్నో ఫుడ్ షాప్స్, మెట్రోపాలిటన్ నగరాల్లో వీటిని బాగా విక్రయిస్తారు.
దేశంలో బ్రేక్ ఫాస్ట్ కింగ్ గా పేరొందిన ముస్తఫా పీసీ సంస్థ వార్షిక టర్నోవర్ లో ఎంతో వృద్ధిని సాధించింది. 2015-2016లో సుమారు రూ.100 కోట్లుగా ఉన్న టర్నోవర్ 182-2017 నాటికి రూ.2018 కోట్లకు పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఐడీ ఫ్రెష్ ఫుడ్ రూ.294 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
ఏదేమైనా.. నాణ్యమైన, చౌకైన, సౌలభ్యం కోసం ముస్తఫా అలుపెరగని అన్వేషణ వినియోగదారులను తనవైపు ఆకర్షించింది. నేడు ఐడి ఫ్రెష్ ఫుడ్ భారతదేశం అంతటా మంచి గుర్తింపు పొందిన బ్రాండ్. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది మంచి గుర్తింపు పొందింది.