చందా కొచ్చర్ కి సెబీ నోటీసులు

First Published 26, May 2018, 11:04 AM IST
ICICI Bank, Chanda Kochhar get Sebi notice in Videocon loan case
Highlights

చందా కొచ్చర్ కి సెబీ నోటీసులు
 

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ఆరోపణలు రావడంతో
సెబీ.. ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ లావాదేవీల వివరాలను వెల్లడించే విషయంలో లిస్టింగ్‌ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఇందులో పేర్కొంది.

చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా  ఈ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెబీ నోటీసులకు తగు వివరణ 
ఇవ్వనున్నట్లు స్టాక్‌  ఎక్సైంజ్ లకు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ రుణం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది.

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం పొందిన వీడియోకాన్‌ గ్రూప్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌... దీపక్‌ కొచ్చర్‌కి చెందిన న్యూపవర్‌ రెన్యువబుల్స్‌లో రూ. 64 కోట్లు
 ఇన్వెస్ట్‌ చేశారు. బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ లావాదేవీలు క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 
ప్రస్తుతం దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ జరుపుతోంది.  

loader