తిరువనంతపురం: వరద భీభత్సంతో కేరళ అతలాకుతలమవుతోంది. పదకొండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేటికి కొన్ని గ్రామాలు జలదిగ్బంధం నుంచి తేరుకోలేదు. జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గరుడ్ కమాండర్‌ ప్రశాంత్‌ అద్భుత సాహసంతో ఓ బాలుడిని కాపాడాడు. ప్రాణాలను సైతం తెగించి చేసిన ఆయన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అలప్పుజ పట్టణంలో ఓ ఇంటి చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో వారంతా ఇంటిపై కప్పుకు చేరుకున్నారు. 

అందులో ఓ బాలుడిని కమాండర్‌ ప్రశాంత్‌ హెలికాప్టర్‌ నుంచి తాడు సాయంతో పై కప్పుకు చేరుకుని ఓ చేత్తో బాలుడిని, మరో చేత్తో తాడును పట్టుకొని సాహసంతో హెలికాప్టర్‌లోకి చేరుకున్నారు. బాలుడిని కాపాడిన కమాండర్‌కు ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసలు కురుపిస్తున్నారు. ప్రశాంత్ రియల్‌ హీరో, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్‌ ఇండియన్‌ ఆర్మీ అంటూ నెటిజన్లు ప్రశాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.