తమిళనాడులోని నీలగిరి కనుమల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా సైనికాధికారుల మృతదేహాలను రేపు ఢిల్లీకి తరలించనున్నారు.


తమిళనాడులోని నీలగిరి కనుమల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా సైనికాధికారుల మృతదేహాలను రేపు ఢిల్లీకి తరలించనున్నారు. గురువారం సాయంత్రానికి వీరి భౌతికకాయాలు దేశ రాజధానికి చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రావత్ సహా అందరి పార్ధివ దేహాలు వెల్లింగ్టన్‌లోని బేస్ క్యాంపులోనే వున్నాయి.

కాగా.. తమిళనాడు (tamilnadu) రాష్ట్రం కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో బుధవారం ఈ చాపర్ ప్రమాదం (helicopter crash) చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నారు. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కుప్పకూలింది.

Also Read:Bipin Rawat : భర్తకు తగ్గ భార్య .. చివరికి ఆయనతో పాటే దేశసేవలో ప్రాణ త్యాగం

ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదే ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (Bipin Rawat ) సతీమణి మధులికా (madhulika rawat) కూడా మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో వున్న జనరల్ బిపిన్ రావత్‌ పరిస్ధితి అత్యంత విషమంగా వుంది. అయితే ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. చివరి వరకు మృత్యువుతో పోరాడిన బిపిన్ రావత్ తుదిశ్వాస విడిచారు.