తమకు కాస్త టైం ఇస్తే దాని రిజల్ట్ ఏం రేంజ్‌లో ఉంటుందో ఇండియన్ ఆర్మీ మరోసారి రుజువు చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా సమయం కోసం ఎదురుచూస్తోన్న సైన్యం.. దాడి చేయాల్సిందిగా ప్రధాని నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రెచ్చిపోయింది.

12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు పీఓకే గగనతలంలోకి ప్రవేశించి ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం కురిపించాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు లేజర్-గైడెడ్ బాంబులను టెర్రర్ క్యాంపులపై మన యుద్ధ విమానాలు జారవిడిచాయి.

ఈ దాడుల్లో సుమారు 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ తెలిపింది. అయితే పీఓకేతో పాటు పాక్ భూభాగంలోనూ వైమానిక దాడులు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్ పట్టణంపైనా బాంబులు పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై పాక్ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

సర్జికల్స్ స్ట్రైక్-2: భారత్‌పై పాక్ దాడి చేస్తే..?