Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహం చేశా.. జైలుకెళ్లా: మోడీ వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం తాను సత్యాగ్రహం చేసినట్లు చెప్పారు ప్రధాని నరేంద్రమోడీ. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఢాకాలోని నేషనల్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనల్ డే ఉత్సవాల్లో మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్నారు. 

i went to jail for bangladesh liberation says pm narendra modi ksp
Author
Dhaka, First Published Mar 26, 2021, 6:57 PM IST

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం తాను సత్యాగ్రహం చేసినట్లు చెప్పారు ప్రధాని నరేంద్రమోడీ. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఢాకాలోని నేషనల్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనల్ డే ఉత్సవాల్లో మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తన జీవితంలో ఈ రోజు చాలా ముఖ్యమైనదని ఈరోజు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వామిని చేసినందుకు బంగ్లాదేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

తన రాజకీయ జీవితం తొలినాళ్ళలో చేసిన పోరాటాల్లో బంగ్లాదేశ్ కోసం చేసిన సత్యాగ్రహం ఒకటని ప్రధాని చెప్పారు. తాను తన సహచరులతో కలిసి భారత దేశంలో సత్యాగ్రహం చేశానని ఆయన గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో తన వయసు ఇరవైలలో ఉండేదని.. ఈ సత్యాగ్రహం సందర్భంగా తాను జైలుకు కూడా వెళ్ళానని మోడీ వెల్లడించారు. మహోన్నత బంగ్లాదేశ్ సైనికులు, వారికి సహకరించిన భారతీయులు చేసిన త్యాగాలను ఎన్నటికీ మర్చిపోబోమని ఆయన తెలిపారు. 

అంతకుముందు మోడీ.. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్‌తో చర్చలు జరిపారు. వివిధ మతాల పెద్దలు, మైనారిటీల ప్రతినిధులు, స్వాతంత్ర్య సమర యోధులు, భారత దేశ మిత్రులు, యూత్ ఐకాన్స్‌తో సమావేశమయ్యారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios