Asianet News TeluguAsianet News Telugu

Aryan Khan : నా ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ దొర‌క్క‌పోయినా న‌న్ను జైళ్లో ఉంచారు - ఆర్య‌న్ ఖాన్

డ్రగ్స్ కేసులో అరెస్టు అయి నిర్దోషిగా విడుదలైన ఆర్యన్ ఖాన్ కు విచారణ సందర్భంగా అధికారితో వ్యక్తం చేసిన భావాలను ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ స్టోరీలో ప్రచురించింది. ఎన్సీపీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. 

I was put in jail even though I found drugs near me - Aryan Khan
Author
Mumbai, First Published Jun 10, 2022, 11:20 PM IST

తాను ఏ త‌ప్పు చేయ‌క‌పోయినా అన‌వస‌రంగా త‌న‌ను జైళ్లో ఉంచార‌ని స‌ల్మాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అన్నారు. లేనిపోని అభియోగాలు మోపి త‌నను జైలు జీవితం గ‌డిపేలా చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్య‌న్ ఖాన్ గ‌తేడాది ఆక్టోబ‌ర్ లో డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న విచార‌ణ ఎదుర్కొంటూ జైలు జీవితం గ‌డిపాడు. గ‌త నెల‌లో అత‌డికి ఎన్సీబీ (Narcotics Control Bureau) క్లీన్ చీట్ ఇవ్వ‌డంతో జైలు నుంచి విడుద‌ల అయ్యారు. అయితే ఆర్య‌న్ ఖాన్ ఎన్సీపీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్  తో  విచార‌ణ సంద‌ర్భంగా మాట్లాడిన మాట‌లు తాజాగా బ‌య‌టకు వ‌చ్చాయి. 

‘లెసన్స్ ఫ్రమ్ ది ఆర్యన్ ఖాన్ కేస్’ అనే శీర్షికతో ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ లో కవర్ స్టోరీ ప్రచురితం అయ్యింది. ఈ ఆర్టిక‌ల్ ను రాజ్ చెంగప్ప ర‌చించారు. ఇందులో ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ సింగ్.. ఆర్యన్ ఖాన్ తో చేసిన సంభాషణలను వెల్లడించారు. ఆర్యన్ ఖాన్ వేసే  ఆత్మశోధన ప్రశ్నలు తాను ఊహించలేదని ఇంటర్వ్యూలో సంజయ్ సింగ్ ఒప్పుకున్నాడు. తాను ఆర్యన్ ఖాన్ ను కంఫర్టబుల్‌గా చేసిన తర్వాత అత‌డితో మాట్లాడాన‌ని తెలిపారు.

తల్లిని షూట్ చేసి చచ్చే వరకు ఎదురుచూసిన కొడుకు.. నొప్పితో గంటలపాటు తల్లడిల్లినా పట్టించుకోలేదు

త‌న‌తో మాట్లాడేందుకు ఆర్య‌న్ ఖాన్ ఓపెన్ మైండ్ తో వ‌చ్చాడ‌ని సంజ‌య్ సింగ్ తెలిపారు. ‘‘ సర్ మీరు నన్ను ఒక అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుగా చిత్రీకరించారు. నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఫైనాన్స్ చేస్తాన‌నే ఆరోప‌ణ‌లు చేశారు. ఈ అభియోగాలు అసంబద్ధమైనవి కాదా? అధికారులు నా ద‌గ్గ‌ర ఎలాంటి మాద‌క‌ద్ర‌వ్యాల‌నూ గుర్తించలేదు. అయినప్పటికీ వారు నన్ను అరెస్టు చేశారు. సర్ మీరు నా విష‌యంలో పెద్ద త‌ప్పు చేశారు. నా ప్రతిష్టను నాశనం చేశారు. నేను కొన్ని వారాల పాటు జైల్లో ఎందుకు గ‌డ‌పాల్సి వ‌చ్చింది. నేను నిజ‌యంగా దానికి అర్హుడినా ? ’’ అని ఆర్య‌న్ ఖాన్ తెలిపార‌ని సంజ‌య్ సింగ్ చెప్పారు. 

ఆర్యన్ తండ్రి, నటుడు షారుఖ్ ఖాన్ కూడా తనను కలవాలని అనుకుంటున్నట్లు విచారణలో సంజయ్ సింగ్ తెలుసుకున్నాడ‌ని ఇండియా టుడే మ్యాగ‌జైన్ పేర్కొంది. సంజయ్ సింగ్ ఇతర నిందితుల తల్లిదండ్రులను కలుసుకున్నందున, ఆయ‌న షారుక్ ఖాన్ ను కలవడానికి కూడా అంగీకరించాడు. వీరిద్ద‌రి భేటీ జ‌రిగిన‌ప్పుడు షారుక్ ఖాన్ తన కుమారుడి మానసిక, భావోద్వేగ స్థితి విష‌యంలో ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. ఆర్యన్ సరిగ్గా నిద్రపోవడం లేదని, తానే స్వయంగా ఆర్యన్ పడకగదికి వెళ్లాల్సి వచ్చిందని, రాత్రంతా తనతో కలిసి ఉండాలని కుమారుడు కోరుకున్నాడ‌ని షారుఖ్ ఖాన్ చెప్పిన్న‌ట్టు వెల్ల‌డించారు. 

తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని కలిసిన ప్రధాని మోడీ.. ఆయన పేరు తెలుసా?

ఆర్య‌న్ ఖాన్ కు వ్యతిరేకంగా చెప్పుకోదగ్గ సాక్ష్యాధారాలు లేనప్పటికీ తన కుమారుడిని కించపరుస్తున్నారని షారుఖ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌ని స‌మాజంలో ఒక పెద్ద నేర‌స్తులుగా, రాక్ష‌సులుగా చిత్రీక‌రించార‌ని సంజయ్ సింగ్ తో కన్నీరుమున్నీరుగా విలపించిన షారుఖ్ ఖాన్ వెల్ల‌డించారు. ఈ విష‌యాల‌న్నీ ఇండియా టుడ్ మ్యాగ‌జైన్ లో ప్ర‌చురితం అయ్యాయి. కాగా అక్టోబ‌ర్ నెల‌లో ముంబై ఓడ‌రేవు వ‌ద్ద కార్డేలియా క్రూయిజ‌గ్ డ్ర‌గ్ బ‌స్ట్ కేసులో ఆర్య‌న్ ఖాన్ తో పాటు మ‌రో ఐదుగురిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అయితే ఈ కేసుల‌లో మే 28వ తేదీన ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చీట్ ల‌భించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios