Asianet News TeluguAsianet News Telugu

తల్లిని షూట్ చేసి చచ్చే వరకు ఎదురుచూసిన కొడుకు.. నొప్పితో గంటలపాటు తల్లడిల్లినా పట్టించుకోలేదు

ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వట్లేదని ఓ కొడుకు తల్లిని షూట్ చేశాడు. ఆమె కొనఊపిరితో నొప్పితో విలవిల్లాడిపోయింది. కానీ, ఆ కొడుకు ఆమెను అలాగే చనిపోవాలని అనుకున్నాడు. గంట గంటకు ఒకసారి ఆ గదిలోకి వెళ్లి చనిపోయిందా? లేదా? అని పరిశీలించి పది గంటల తర్వాత ఆమె బాడీలో కదలికలు ఏమీ లేకపోవడంతో చనిపోయిందని నిర్దారించుకున్నాడు. అన్ని గంటలపాటు ఆమె పడిన వేదన వర్ణనాతీతం.

teen shot mom and waited hours for her to die but did not consider to save
Author
Lucknow, First Published Jun 10, 2022, 6:56 PM IST

లక్నో: మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయనే మాటకు సజీవ సాక్ష్యం ఈ ఘటన. సమాజంలో నేర ప్రవృత్తితో పెచ్చరిల్లుతున్నదని అనడానికి అదీ ముఖ్యంగా పిల్లల్లోనూ కనిపిస్తున్నదని చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. ఓ 16 ఏళ్ల అబ్బాయి.. పబ్ జీ ఆడనివ్వట్లేదని కన్న తల్లినే అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. మమకారం కాదు కదా.. కనీస కనికరం కూడా లేకుండా తల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు. తల్లిపైకి ఒక సారి షూట్ చేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు గమనించాడు. మరోసారి షూట్ చేసి చంపేయలేదు. కానీ, ఆ తల్లి మరణించే వరకు ఎదురుచూశాడు. నొప్పితో ఆ తల్లి తల్లడిల్లినా పట్టించుకోలేదు. చనిపోయిందా లేదా? అని తరచూ పరీక్షిస్తూ మరీ కనీసం పది గంటలు ఎదురుచూశాడు. ఆ తర్వాత తన తల్లి ముక్కు నుంచి శ్వాస రావడం లేదని గమనించి చనిపోయిందని నిర్దారించుకున్నాడు.

అంతేకాదు, ఆ డెడ్ బాడీని ఇంటిలోని ఓ గదిలో పెట్టి లాక్ వేశాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకునే ఆ
బాలుడు తన ఫ్రెండ్స్‌ను టైం పాస్ కోసం ఇంటికి పిలిచాడు. ఇద్దరు ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించి ఓ హిందీ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఎగ్ కర్రీని ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకుని తిన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన పీజీఐ ఏరియాలో జరిగింది.

పీజీఐ ఏరియాలో సాధనా సింగ్ అనే మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. ఆమె భర్త మిలిటరీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. ఉద్యోగ నిమిత్తం ఆయన పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్నాడు. కుమారుడు, కుమార్తెలతో సాధన కుటుంబం సాఫీగానే సాగిపోతున్నది. కానీ, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస అవుతున్నట్టే ఆమె కుమారుడు కూడా తరుచూ పబ్ జీ అనే గేమ్‌(ఈ గేమ్‌లోనూ విపరీతమైన హింస ఉంటుందనేది తెలిసిన విషయమే)లోనే మునిగి తేలాడు. ఈ విషయం గ్రహించిన తల్లి కుమారుడిని మందలించింది. ఆమె కొడుకు తిరగబడ్డాడు. కొన్ని రోజల పాటు ఇదే తంతు కొనసాగింది. చివరకు ఆదివారం అర్ధరాత్రి తండ్రికి చెందిన లైసెన్స్ తుపాకీని తీసుకుని తల్లిని కాల్చి చంపాడు.

నిందితుడు 16 ఏళ్ల బాలుడిని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు కాశిమ్ అబ్ది మరోసారి విచారించాడు. రెండో రౌండ్ ఇన్వెస్టిగేషన్‌లో మరిన్ని దారుణమైన విషయాలు తెలిశాయి. ఈ దర్యాప్తులో వెల్లడైనట్టుగా దైనిక్ భాస్కర్ వెల్లడించిన కథనం ప్రకారం, తల్లి వేలి నుంచి తాళం చెవి తీసుకుని రాత్రి సుమారు 2 గంటలకు తండ్రికి చెందిన హ్యాండ్ గన్, బుల్లెట్ మ్యాగజీన్ తీశాడు. తల్లిపైకి కాల్పులు జరిపాడు. తల్లి బాధతో విలపించింది. కొడుకు అదే స్థితిలో ఆమెను అలా వదిలిపెట్టి మరో గదిలోకి వెళ్లాడు. మరో సారి కాల్చి తల్లిని చంపేయాలని ఆ టీనేజీ అబ్బాయి అనుకోలేదు. ఆమె అలాగే చనిపోవాలని ఎదురుచూశాడు. ప్రతి గంటకు ఒక సారి ఆ గదిలోకి వెళ్లి తల్లి మరణించిందా? లేదా? అని పరిశీలించాడు. వెళ్లిన ప్రతిసారి తల్లి తీవ్రమైన నొప్పితో తల్లడిల్లింది. కానీ, ఆ తల్లిని బాలుడు రక్షించాలని అనుకోలేదని దైనిక్ భాస్కర్ కథనం తెలిపింది.

అంతేకాదు, గదిలోకి వెళ్లి తల్లి ముక్కు దగ్గర ఊపిరి ఆడుతున్నదా? లేదా? అని మరీ పరీక్షించాడని కథనాలు తెలిపాయి. పది గంటల్లో కనీసం ఎనిమిది సార్లు తల్లి శ్వాసను ఆ బాలుడు పరీక్షించాడు. తర్వాతి రోజు మధ్యాహ్నం ఆ గదిలోకి  వెళ్లి చూడగా.. అప్పుడు తల్లి మరణించినట్టుగా నిర్దారించుకున్నాడు. బాడీలో ఎలాంటి కదలికలు లేవని నిర్దారించుకన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఘటన జరిగిన రెండు రోజులకు ఆ బాలుడు తండ్రికి విషయాన్ని వెల్లడించాడు. తల్లిని షూట్ చేయడానికి ముందు తన చెల్లిని మరో గదిలో బంధించాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఆ తర్వాత ఇంట్లో ఏమీ జరగనట్టే ఫ్రెండ్స్‌ను పిలిచి ఎంజాయ్ చేశాడు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన బయటకు వ్యాపించకుండా రూమ్ ఫ్రెష్‌నర్‌ను స్ప్రే చేశాడు. కానీ, రెండు రోజుల తర్వాత విషయం పోలీసులకు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios