Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాలకు నా జీవితాన్నే కోల్పోయాను.. నా కొడుకు ఇందులోకి రానక్కర్లేదు.. ఆ పార్టీ చీఫ్ వ్యాఖ్యలు

నాతోనే ఈ రాజకీయాలు ముగిసిపోని, వాటిలోకి నా కొడుకూ రావాలని భావించడం లేదు. రాజకీయాల కోసం నా జీవితాన్నే కోల్పోయాను అని తమిళనాడులోని ఎండీఎంకే పార్టీ జనరల్ కార్యదర్శి వైకో అన్నారు. కానీ, ఆయన పార్టీ నేతలు మాత్రం వైకో కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తేనే పార్టీ పురుత్తేజితమవుతుందని భావిస్తున్నారు.
 

i want to end political life with me my son need not to come says mdmk vaiko
Author
Chennai, First Published Oct 10, 2021, 5:00 PM IST

చెన్నై: కొందరు రాజకీయాలు పవర్‌ఫుల్‌గా భావిస్తారు. ఒక్కసారైనా అధికారాన్ని దక్కించుకోని పాలించాలి అని కలలు కంటుంటారు. ప్రపంచంలో ‘పవర్’ చాలా పవర్‌ఫుల్ అని వారు చెబుతుంటారు. సాధారణంగా పార్టీ అధినేతలూ తమ వారసులను ఇందులోకి ఎంటర్ చేస్తారు. కానీ, తమిళనాడులోని mdmk పార్టీ వ్యవస్థాపకుడు, జనరల్ సెక్రెటరీ vaiko మాత్రం ఇందుకు భిన్నంగా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. తన కొడుకు వయాపురి politicsలోకి రావాలనే ప్రతిపాదనపై సుముఖంగా లేరు.

స్థానిక ఎన్నికల కోసం ఆయన స్వగ్రామం కలింగపట్టిలో ఓటు వేసిన తర్వాత కుమారుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘నాతో చాలు ఈ రాజకీయాలు.. నా కొడుకూ ఇందులోకి రావాల్సిన అవసరం లేదు. 56ఏళ్ల నా రాజకీయ జీవితంలో లక్షల కిలోమీర్లు కారులో ప్రయాణం చేశా.. వేల కిలోమీటర్లు నడిచాను. వందలాది ఆందోళనల్లో పాలుపంచుకున్నాను. అంతేకాదు, ఓ ఐదున్నరేళ్లు జైలు జీవితాన్నీ గడిపాను. నా జీవితాన్నే రాజకీయాలకు కోల్పోయాను. ఇది నాతోనే ముగిసిపోనివ్వండి. నా కొడుకూ రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదు’ అని వైకో అన్నారు.

Also Read: రాజద్రోహం కేసు: ఎండిఎంకె నేత వైకోకు ఏడాది జైలు

అయితే, తన కొడుకు వయాపురి రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది తాను తీసుకునే నిర్ణయం కాదని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శులు తీసుకుంటారని వివరించారు. కాగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నేతలూ వయాపురి రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. వయాపురి రెండేళ్ల క్రితం పాలిటిక్స్‌లోకి రావడానికి ఇంటరెస్ట్ చూపించలేదు. కానీ, ఇప్పుడిప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios