దేవేంద్ర ఫడ్నవీస్ జెంటిల్‌మెన్ అనుకున్నా.. కానీ, ఇలా గడిచిన ఘటనలను గుర్తు చేస్తూ వాటిని తప్పుగా చిత్రించి స్టేట్‌మెంట్‌లు ఇస్తారని అనుకోలేదు అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 2019నాటి ఘటనలను గుర్తు చేస్తూ ఎన్సీపీపై విమర్శలు సంధించారు. 

ముంబయి: మూడేళ్ల క్రితం ఘటనను గుర్తు చేసుకుని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్సీపీపై ఆరోపణలు చేశారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న కాలంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కు విజ్ఞప్తి చేయడం.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడ.. ఆ ప్రభుత్వం మూడు రోజుల్లో కూలిపోవడం వంటి కీలక పరిణామాలు జరిగాయి. తాజాగా, ఈ ఎపిసోడ్‌ను గుర్తు చేస్తూ ఎన్సీపీ పై దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపణలు సంధించారు.

‘ఎన్సీపీ నుంచి మాకో ఆఫర్ వచ్చింది. వారికి ఒక సుస్థిర ప్రభుత్వం కావాలని అన్నారు. అందుకే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎన్సీపీ ఆఫర్ చేసింది. మేం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. చర్చించడానికి ముందుకు వెళ్లాం. శరద్ పవార్‌తో చర్చలు కూడా జరిగాయి. కానీ, అప్పుడే ఎన్నో మార్పులు జరిగాయి. అవి ఎంతలా మారిపోయాయో మీరంతా చూసే ఉన్నారు’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అజిత్ పవార్ తన ప్రభుత్వం నుంచి 80 గంటల తర్వాత తప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కామెంట్ చేశారు.

Also Read: ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు.. ప్రజల ముందుకు వస్తారు: నెడుమారన్ సంచలన వెల్లడి

‘నేను ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పదలిచాను. అజిత్ పవార్ నాతో పాటుగా నిజాయితీగానే ప్రమాణం చేశాడు. కానీ, ఆ తర్వాతే ఎన్సీపీ దాని స్ట్రాటజీని మార్చేసింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

ఈ వ్యాఖ్యల పై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రెస్పాండ్ అయ్యారు. ‘దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సభ్యత, సంస్కృతి గల మనిషి, జెంటి ల్‌మెన్ అనుకున్నాను. గడిచిన ఘటనలను ప్రస్తావించి వాటిని తప్పుగా చిత్రించి ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇస్తారని ఊహించలేదు’ అని అన్నారు.