ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సర్వే

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై  ఐటీ అధికారులు ఇవాళ సర్వే నిర్వహించారు.
 

I-T Raids Underway At BBC Offices In India

న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, అక్రమాలకు  సంబంధించి  ఢిల్లీ, ముంబైలలోని  బీబీసీ  కార్యాలయాల్లో మంగళవారంనాడు  ఐటీ  శాఖ అధికారులు  సర్వే నిర్వహించారు. బీబీసీ  కార్యాలయంలో  పనిచేసే ఉద్యోగుల నుండి  ఐటీ అధికారులు మొబైల్స్ సీజ్  చేసుకున్నారని సమాచారం.  బీబీసీ  ఇటీవల ప్రసారం  చేసిన  డాక్యుమెంటరీ  వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాల్లో  నిషేధం విధిస్తూ  కేంద్రం  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

ప్రధాన మంత్రి మోడీపై  వివాదాస్పద  డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీని ఇండియాలో నిషేధించాలని  హిందూసేన దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు కొట్టివేసిన  విషయం తెలిసిందే.  

 ఢిల్లీ, ముంబైలోని  బీబీసీ కార్యాలయాల్లో   సర్వే నిర్వహించామని  సీబీడీటీ  సీనియర్ అధికారి  చెప్పారని జాతీయ మీడియా సంస్థ  కథనం తెలిపింది.  ఈ ఘటనపై  బీజేపీపై  విపక్షాలు  తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.   బీబీసీ కార్యాలయంలో  ఐటీ అధికారుల  సర్వే పై   కాంగ్రెస్  నేత  జైరాం  రమేష్  మండిపడ్డారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios