మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం నాడు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 


భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం నాడు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు నిర్వహించారు.సీఎం ఓఎస్‌డీ, అమిరా గ్రూప్‌, మోసర్‌ బేయర్, ఇండోర్‌, భోపాల్‌, గోవా, భూలా, ఢిల్లీలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సోదాల ద్వారా మొత్తం రూ.9 కోట్లు సీజ్‌ చేసినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు

ఈ దాడులపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆయన అన్నారు. కేంద్రం, మోదీ దాడులకు తాము భయపడేది లేదని కమల్‌నాథ్ అన్నారు.