Asianet News TeluguAsianet News Telugu

అంతా తూచ్.. నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు - మేరీకోమ్

తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని (I have not announced retirement) ఖేల్ రత్న అవార్డు గ్రహీత, ఆరుసార్లు బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ (Mary Kom) అన్నారు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. తాను ఇంకా ఫిట్ గా ఉన్నానని చెప్పారు. 

I haven't announced retirement.. I'm still fit - Mary Kom..ISR
Author
First Published Jan 25, 2024, 2:54 PM IST

Mary Kom : ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఆరుసార్లు బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించింది. అవన్నీ అవాస్తవాలని చెప్పింది. తాను రిటైర్మెంట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపింది.ఇప్పటికే అమెచ్యూర్ సర్క్యూట్ లో పోటీ పడేందుకు వయసు దాటిన మణిపూర్ కు చెందిన ఈ 41 ఏళ్ల క్రీడాకారిణి రిటైర్మెంట్ విషయంలో వస్తున్న వార్తలను తప్పుబట్టారు.

చెప్పుల ట్రీట్‌మెంట్‌ కాంగ్రెస్‌ నేతలకే కావాలి.. రైతులకు కాదు.. - కేటీఆర్‌

‘‘నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. నన్ను (నా వ్యాఖ్యలను) తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయం నేను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తాను. నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లు కొన్ని మీడియా కథనాలను చదివాను. ఇది నిజం కాదు’’ అని ఆమె పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

‘‘నేను 2024 జనవరి 24 న దిబ్రూగఢ్ (అస్సాం) లో ఒక పాఠశాల ఇన్ ఈవెంట్ కు హాజరయ్యాను. ఇందులో నేను పిల్లలను మోటివేట్ చేస్తూ.. నాకు ఇప్పటికీ క్రీడలలో సాధించాలనే ఉందని, కానీ ఒలింపిక్స్ లో వయో పరిమితి నిబంధన నన్ను అనుమతించదని చెప్పాను’’ అని ఆమె అన్నారు. కానీ దానిని మీడియా తప్పుగా అర్థం చేసుకుందని ఆమె వివరించారు. తాను ఇప్పటికీ ఫిట్ నెస్ పై  దృష్టి పెడుతున్నానని, రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు తప్పకుండా అందరికీ తెలియజేస్తానని మేరికోమ్ అన్నారు. దయచేసి దీనిని సరిదిద్దండి మీడియాను ఆమె కోరారు. 

గోవాకు హనీమూన్ కు వెళ్దామని చెప్పి.. అయోధ్య తీసుకెళ్లిన భర్త.. విడాకులు కోరిన భార్య..

కాగా.. టోక్యో ఒలింపిక్స్ లో ప్రీక్వార్టర్ ఫైనల్ లో ఓడిన తర్వాత మేరీకోమ్ బరిలోకి దిగడం లేదు. అయితే వయో పరిమితి నిబంధనల లేని చోట కూడా ఆమె ఆటకు దూరంగా ఉంటోంది. దీంతో ఆమె రిటైర్మెంట్ విషయంలో ఎప్పటి నుంచో తీవ్ర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె అరడజను ప్రపంచ బంగారు పతకాలతో పాటు ఆరు ఆసియా టైటిళ్లను గెలుపొందారు. ఖేల్ రత్న అవార్డు గ్రహీత అయిన మేరీకోమ్ కు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. 2020లో దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios