ఫైళ్లపై సంతకాలు పెట్టేటప్పుడే తాను ప్రధానిగా ఫీల్ అవుతానని, మిగితా సమయం అంతా తాను దేశంలోని పౌరులందరికీ ఒక సేవకుడిగానే అనుకుంటానని అన్నారు. మంగళవారం సిమ్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని మాట్లాడారు.
గడిచిన 8 ఏళ్లలో తాను ఎన్నడూ కూడా ప్రధాన మంత్రిగా అని అనుకోలేదని, తాను 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడిని మాత్రమే అని అనుకున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం సిమ్లాలో ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ గత 8 ఏళ్లలో ఒక్కసారి కూడా నన్ను నేను ప్రధానిగా అనుకోలేదు. నేను డాక్యుమెంట్లపై సంతకం చేసినప్పుడు మాత్రమే నాకు ప్రధాని బాధ్యత ఉంటుంది, కానీ ఫైల్ పోయిన వెంటనే, నేను ఇకపై ప్రధానిని కాను... నేను 130 కోట్ల మంది ప్రజలకు కేవలం ప్రధాన సేవకుడిని అనే భావన నాలో కలుగుతుంది ’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
Singer KK : ప్రముఖ గాయకుడు కేకే మృతి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సిమ్లాలోని రిడ్జ్ మైదాన్ లో సభ నిర్వహించారు.ఈ సభలో ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ప్రసంగించారు.
2014కు ముందు అవినీతిని ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా భావించేవారని ప్రధాని మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా స్కాలర్షిప్ లేదా మరేదైనా పథకం కావచ్చు.. ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం ద్వారా మేము అవినీతి పరిధిని నిర్మూలించాము. వివిధ పథకాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.22 లక్షల కోట్లను నేరుగా బదిలీ చేశాం ’’ అని ప్రధాని మోడీ తెలిపారు.
ఈ సభ సందర్భంగా ప్రధాని దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రతీ భారతీయుడి గౌరవం, భద్రత, శ్రేయస్సు, సంతోషం, శాంతి కోసం తాను చేయగలినదంతా చేస్తానని అన్నారు. మన దేశంలో దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. సొంతంగా ఓటు బ్యాంకు సృష్టించుకునే రాజకీయాలు దేశానికి చాలా నష్టం చేశాయని అన్నారు. తాము ఓటు బ్యాంకు కోసం పని చేయడం లేదని, నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి ఈదుతూ భారత్‌లోకి.. లవర్‌ను పెళ్లి చేసుకోవడానికి యువతి ఏటికి ఎదురీత
ప్రతీ లబ్దిదారుడికి 100 శాతం ప్రయోజనం అందించేందుకు తాము చొరవ తీసుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రతీ ఒక్క లబ్దిదారుడి సంతృప్తి కోసం ప్రతిజ్ఞ తీసుకున్నామని అన్నారు.100 శాతం సాధికారత అంటే ప్రతీ పేదవాడికి వంద శాతం ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలు అందుతాయని అన్నారు. పీఎం హౌసింగ్ స్కీమ్ అయినా, స్కాలర్‌షిప్, పెన్షన్ స్కీమ్ అయినా టెక్నాలజీ సాయంతో అవినీతి పరిధిని కనిష్ట స్థాయికి తగ్గించామని తెలిపారు. గతంలో శాశ్వతంగా భావించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు.
