పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం భారత వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనం చేసిన సంగతి తెలిసిందే.  ఈ విజయంతో దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

పైలట్లను అభినందిస్తూ సెల్యూట్ చేస్తున్నారు. శత్రు దేశం భూభాగంలోకి వెళ్లి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి సురక్షితంగా వెనక్కి రావడం భారత సైన్యం ధైర్య సాహసాలకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు.

కాగా మిరాజ్-2000 యుద్ధ విమానాలను నడిపిన వారిలో తెలుగు పైలట్ ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అనేక మందితో పాటు మీడియా సైతం పైలట్ వివరాలతో పాటు అతని తల్లిదండ్రులను కలుసుకోవాలని ప్రయత్నించింది. అయితే రక్షణ శాఖకు సంబంధించిన విషయం కావడంతో ఆయన ఎవరన్నది బయటకు రాలేదు.  

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?