భర్త మరణం.. భార్య 27 వారాల గర్భం తొలగింపు..
భర్త మరణించడంలో ఓ గర్భవతి మానసికంగా కుంగిపోయింది. ఆమె మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో ఆ వితంతువు తన గర్భాన్ని తొలగించుకోవాలని అనుకుంది. దీనిపై ఢిల్లీ కోర్టు విచారణ జరిపి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గర్భం తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఓ మహిళకు ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. కొంత కాలం తరువాత ఆమె గర్భం దాల్చింది. అయితే కొన్ని రోజుల అనంతరం భర్త మరణించాడు. దీంతో ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతింది. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. దీంతో తన గర్బాన్ని తొలగించుకోవాలని అనుకుంది. కానీ అప్పటికే ఆలస్యమైంది. 27 వారాల గర్భంతో ఉండటంతో కోర్టు అనుమతి అవసరమైంది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఆ వితంతువు 27 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు గురువారం అనుమతించింది.
హైజాగ్ కు గురైన భారతీయులున్న నౌక.. సోమాలియా తీరంలో ఘటన.. రంగంలోకి ఐఎన్ఎస్ చెన్నై
పరిస్థితులలో మార్పు, ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయానని ఆ మహిళ కోర్టుకు తెలిపింది.పిటిషనర్ వాదనలు, సైకియాట్రిక్ మూల్యాంకన నివేదికను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ మహిళ అభ్యర్థనను అనుమతించారు.
తీర్పు వెలువరిస్తూ జస్టిస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘పిటిషనర్ వైవాహిక స్థితిలో మార్పు వచ్చింది. ఆమె వితంతువు అయింది. ఎయిమ్స్ అందించిన నివేదిక ప్రకారం మహిళ తన భర్త మరణం కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నట్టు అర్థమవుతోంది. ఆమె మానసిక సమతుల్యతను కోలోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో తనకు తాను హాని కలిగించుకునే అవకాశం ఉంది’’ అని ఆయన అన్నారు.
ఇరాన్ లో జంట పేలుళ్లు.. 95 మంది దుర్మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత్
‘‘ఇలాంటి పరిస్థితుల్లో మహిళ గర్భాన్ని కొనసాగించాలని చెప్పడం వల్ల ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఆమె ఆత్మహత్య ధోరణులను కలిగి ఉన్నందున గర్భం తొలగించేందుకు అనుమతించాలని ఈ కోర్టు అభిప్రాయపడింది. మహిళ గర్భాన్ని తొలగించే ప్రక్రియను ప్రారంభించాలని ఎయిమ్స్ ను కోర్టు ఆదేశించింది. 24 వారాల గర్భధారణ కాలం దాటినప్పటికీ ఎయిమ్స్ దీనిని కొనసాగించాలి’’ అని జస్టిస్ ప్రసాద్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా గతంలో బెంచ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన చట్టాన్ని ప్రస్తావించింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే
2023 అక్టోబర్ 9న మహిళ భర్త చనిపోయారు. దీంతో ఆమె మానసిక పరిస్థితి దెబ్బతింది. వితంతువును ఎయిమ్స్ లోని సైకియాట్రీ వార్డులో చేర్పించి మానసిక పరీక్షలు నిర్వహించారు. మెడికల్ బోర్డు మొదట్లో గర్భస్రావానికి సిఫారసు చేయలేదు. ఆమె మానసిక, శారీరక గాయం, ఆహారం సరిగ్గా తినకపోవడం వల్ల గర్భం తొలగించాల్సిన అవసరం ఉందని ఆమె తరఫు న్యాయవాది డాక్టర్ అమిత్ మిశ్రా వాదించారు. అయితే గర్భాన్ని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె గోప్యతపై దాడి అని మిశ్రా తెలిపారు. మహిళ తరఫు న్యాయవాది వాదనలు విని, పిటిషనర్ మానసిక మూల్యాంకన నివేదికను అధ్యయనం చేసిన ఢిల్లీ హైకోర్టు గురువారం ఈ పిటిషన్ పై తీర్పును వెలువరించింది.