Asianet News TeluguAsianet News Telugu

హైజాగ్ కు గురైన భారతీయులున్న నౌక.. సోమాలియా తీరంలో ఘటన.. రంగంలోకి ఐఎన్ఎస్ చెన్నై

భారతీయులున్న నౌక మళ్లీ హైజాగ్ కు గురైంది. లైబీరియాకు చెందిన ఆ నౌక సోమాలియా తీరంలో దుండగులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిని రక్షించేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. 
 

The Indian ship that was hijacked.. The incident off the coast of Somalia.. INS Chennai intervened..ISR
Author
First Published Jan 5, 2024, 12:58 PM IST

సోమాలియా తీరానికి సమీపంలో లైబీరియాకు చెందిన ఓ నౌక హైజాక్ కు గురైంది. ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అయితే వారిని రక్షించేందుకు, పరిస్థితిని పర్యవేక్షించడానికి భారత నావికాదళం యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నైని మోహరించింది. హైజాక్ కు గురైన నౌక పేరు 'ఎంవీ లీలా నోర్ ఫోక్'గా అధికారులు గుర్తించారు. దీనిని భారత నౌకాదళం నిశితంగా పరిశీలిస్తోంది.

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ.. అతడు ఎవరంటే ?

ఇండియన్ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలు నిఘా పెట్టాయని, నౌకలో సురక్షిత గృహంలో ఉన్న సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశామని సైనికాధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నేవీ తెలపింది.

మిలిటరీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమాలియా తీరంలో ఓడ హైజాక్‌కు సంబంధించిన సమాచారం గురువారం (జనవరి 4) సాయంత్రం అందింది.. ఈ నౌక గురువారం సాయంత్రం సుమారు ఐదారుగురు గుర్తుతెలియని సాయుధ సిబ్బందితో బోర్డింగ్ చేస్తున్నట్లు యూకేఎంటీవో  (యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్) పోర్టర్ కు సందేశాన్ని పంపింది.

ఇరాన్ లో జంట పేలుళ్లు.. 95 మంది దుర్మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత్

అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్‌కు చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై ఓడ వైపు కదులుతోంది. ఇతర ఏజెన్సీల సహాయం కూడా తీసుకుంటోంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలతో ఈ ప్రాంతంలో ఆ ఓడను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని నేవీ తెలిపింది. కాగా.. అరేబియా సముద్రంలో పైరసీని దృష్టిలో ఉంచుకుని మాల్టీస్-ఫ్లాగ్ ఉన్న వ్యాపారి నౌకను గుర్తుతెలియని దాడిదారులు స్వాధీనం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ హైజాక్ జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios