పెళ్లైన పుష్కరానికి భార్య బంగ్లాదేశీయురాలని తేలడంతో.. ఆ భర్త చేసిన పని...
బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో నివాసం ఉంటున్న 37 ఏళ్ల వ్యాపారవేత్త తబీష్ ఎహ్సాన్ 2009లో నాజియా అంబ్రీన్ ఖురైషీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 12 సంవత్సరాల తర్వాత, తన భార్య బంగ్లా జాతీయురాలని తేలిసింది.

కోల్‌కతా : పెళ్లై 14 యేళ్ల తర్వాత, కోల్‌కతాకు చెందిన ఒక వ్యాపారవేత్తకు తన భార్య జాతీయత గురించి తెలిసింది. ఆమె భారతీయురాలు కాదని, బంగ్లాదేశ్ జాతీయురాలని తెలుసుకున్నాడు. దీంతో భారత పౌరసత్వం పొందేందుకు తనను ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ ఆ వ్యాపారవేత్త తన భార్యపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నాడు.
బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో నివాసం ఉంటున్న 37 ఏళ్ల తబీష్ ఎహ్సాన్, 2009లో నాజియా అంబ్రీన్ ఖురైషీని వివాహం చేసుకున్నాడు. నాజియా తనను తాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుంది. వారి వివాహాన్ని ఇరు కుటుంబాలు ఆమోదించాయి. 2022 వరకు అన్నీ సజావుగా జరిగాయి.
6 రాష్ట్రాలు, 51 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు.. ఎందుకంటే ?
దీనిమీద తబీష్ మాట్లాడుతూ, "నేను నాజియాను మొదటిసారి వివాహ వేడుకలో కలిశాను. మా బంధువులు అందరూ అంగీకరించిన తర్వాత వివాహం చేసుకున్నాం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లికి ముందు, ఆమె తాను ఉత్తరప్రదేశ్ లో పుట్టి పెరిగానని పేర్కొంది. ఆమె పౌరసత్వం గురించి మొదట్లో ఎలాంటి సందేహం రాలేదు" అన్నాడు.
వారి రెండవ బిడ్డ పుట్టిన తరువాత వారి వివాహంబంధంలో తేడాలు వచ్చాయి. తబిష్ ఎహ్సాన్ తన భార్య ప్రసవానికి ముందు అకస్మాత్తుగా తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. అతనితో అన్ని రకాల కమ్యూనికేషన్స్ బంధ్ చేసిందని ఆరోపించాడు. ఆ తరువాత నాజియా అతని వద్దకు తిరిగి రాదని అతని అత్తమామలు తెలియజేసారు. అంతేకాదు, ఆమె కుటుంబ సభ్యుల నుండి బెదిరింపులు వచ్చినట్లు అతను పేర్కొన్నాడు.
తరువాత, నాజియా కుటుంబం తబీష్ ఎహ్సాన్‌పై సెక్షన్ 498A కింద కేసు దాఖలు చేసింది. అయితే కోల్‌కతాలోని అలీపూర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలోనే తబీష్‌కి తన భార్య నిజమైన జాతీయత గురించి తెలిసింది. నాజియా నిజానికి బంగ్లాదేశ్ జాతీయురాలని తబీష్ తన బంధువుల్లో ఒకరి ద్వారా తెలుసుకున్నాడు.
"అప్పుడే నాజియా బంగ్లాదేశ్ జాతీయురాలని మా బంధువుల్లో ఒకరి ద్వారా తెలిసింది. ఆశ్చర్యకరంగా, ఆమె బంగ్లాదేశ్‌లోని మరొక వ్యక్తితో అదే పని చేసింది. నాజియా బంగ్లాదేశ్‌లో ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని వివాహం చేసుకుంది. తరువాత అతని నుండి విడాకులు తీసుకుంది. అతనిపై తప్పుడు ఆరోపణలు చేసింది" అని తబీష్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎలాంటి వీసా లేకుండా అక్రమంగా భారత్‌కు వచ్చారు. భారత్ లో గుర్తింపు కోసం నన్ను ఉపయోగించుకున్నారు. నా పెళ్లి వారి కుట్రలో భాగమే’అని ఆయన అన్నారు.
ఇప్పుడు, తబీష్ ఎహ్సాన్ తన భార్య నజియా ఖురేషీ, ఆమె కుటుంబ సభ్యులపై కోల్‌కతాలోని టిల్జాలా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అతని కోర్టు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను ప్రారంభించారు. ఇది సెక్షన్ 120B, IPCలోని సెక్షన్ 120B, 465, 467, 471, 363, ఫారినర్ యాక్ట్‌లోని సెక్షన్ 14A(b), సెక్షన్ 17తో సహా వివిధ చట్టాల వివిధ సెక్షన్లను కవర్ చేస్తుంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
అధికారులకు ఆధారాలు సమర్పించినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తబీష్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆమె 2007-2009 మధ్య చదువుల కోసం కెనడాకు వెళ్లినట్లు నాకు తెలిసింది. కానీ ఆమె 2020లో మొదటిసారిగా భారతీయ పాస్‌పోర్ట్‌కు ఆమోదం పొందింది. పాస్‌పోర్ట్ లేకుండా కెనడాకు ఎలా ప్రయాణించింది? కెనడా ఆమెకు వీసాను ఎలా ఆమోదించింది? " అని ప్రశ్నించాడు.
తబీష్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, వైజెన్సీ కమిషన్, కోల్‌కతాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలు ప్రభుత్వ శాఖలకు పలు లేఖలు పంపారు.