టీ ఇవ్వడం ఆలస్యం చేస్తుందని భార్యతో గొడవ పడ్డ ఓ భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. 

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఉదయాన్నే ఛాయ్ ఇవ్వడం ఆలస్యమయిందని భార్యను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గపు భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. టీ ఇవ్వడంలో ఆలస్యం చేశారనే ఆరోపణతో ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన గ్వాలియర్ జిల్లా పరిధిలోని తాటిపూర్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, మోహిత్ రజక్ (27), అతని భార్య సాధన (22) తాటిపూర్ గ్రామంలో ఉంటున్నారు. ఈ దంపతులు ఉదయం స్థానిక ఆలయానికి వెళ్లాలనుకున్నారు. భార్య పట్టుబట్టడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.

సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

వారిని శాంతింపజేసేందుకు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆ తరువాత అక్కడితో పోనివ్వకుండా.. మోహిత్ తన భార్య ఉదయం టీ ఇవ్వడం ఆలస్యం చేస్తుందని ఆరోపించడంతో దంపతులు మళ్లీ గొడవ ప్రారంభించారు.

ఆ తరువాత నిందితుడు ఆమెను కొట్టడం ప్రారంభించాడని, పట్టరాని కోపంతో ఆమె గొంతుకోసి చంపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె ఒంటిపై గాయాల గుర్తులు ఉండడంతో హత్యగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్టు చేశామని, టీ ఇవ్వడానికి ఆలస్యం చేసినందుకు తన భార్యను హత్య చేశానని నేరం అంగీకరించాడని, అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారని విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనీష్ ధాకడ్ తెలిపారు.