Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాలో వీడియోలు చేస్తోందని.. భార్యను గొంతునులిమి చంపి, రాత్రంతా శవం పక్కనే..

సోషల్ మీడియాలో భార్య వీడియోలు చేయడం నచ్చని భర్త దారుణానికి తెగబడ్డాడు. క్షణికావేశంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. 

husband strangled wife for making videos on social media in bihar
Author
First Published Sep 28, 2022, 9:43 AM IST

బీహార్ : సోషల్ మీడియాలో వీడియోలు చేస్తారు భర్త తన భార్యను హత్య చేసిన ఘటన బీహార్ భోజ్ పుర్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నూ ఖాతూన్, అనిల్ కు పదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ జరిగింది. సోషల్ మీడియాలో అన్నూ వీడియో (రీల్స్)లు చేస్తుండేది. భార్య అలా చేయడం భర్తకు నచ్చలేదు. వీడియోలు చేయొద్దు అని ఆమెను కోరాడు. ఇందుకు అన్నూ నిరాకరించింది. దీంతో ఉద్రేకానికి గురైన అనిల్ భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. 

ఆ తరువాత రాత్రంతా భార్య శవం పక్కనే కూర్చున్నాడు. నిందితుడి తల్లికి అనుమానం వచ్చి తలుపు తట్టడంతో.. గదిలో శవం పక్కన కామ్ గా కూర్చున్న కొడుకు కనిపించాడు. దీంతో ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడు అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇన్‌స్టా రీల్స్‌తో ట్రాప్.. అబ్బాయిల వీడియో కాల్స్‌ని న్యూడ్‌గా మార్ఫింగ్, ఆపై బెదిరింపులు

ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 20న కాన్పూర్ లో జరిగింది. ఫరూఖాబాద్‌లోని అస్తబల్ తరాయ్ ప్రాంతంలో ఉంటున్న 24 ఏళ్ల ఓ యువతి తన ఇద్దరు తమ్ముళ్లపై దారుణంగా దాడి చేసింది. ఆమెను రీల్స్ చేయకుండా అడ్డుకుంటున్నారని వారిపై ఈ దారుణానికి తెగబడింది. ఇద్దరు సోదరుల్లో ఒకరి గొంతు కోసి చంపడానికి కూడా ప్రయత్నించింది. ఈ మేరకు అబ్బాయిల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సోమవారం యువతిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఘటన రోజు తెల్లవారుజామున, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని మౌదర్వాజ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. 
అప్పుడు కూడా ఆమె అలాగే ప్రవర్తించింది. 

అక్కడున్న నలుగురు మహిళా కానిస్టేబుళ్ల మీద అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారి యూనిఫామ్‌ను కూడా చింపేసింది. స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌తోనూ బాలిక దురుసుగా ప్రవర్తించింది. ఆకాష్ రాజ్‌పుత్ అనే బాలుడు.. తన అన్న జైకిషన్ రాజ్‌పుత్‌తో కలిసి మౌ దర్వాజా పోలీస్ స్టేషన్‌లో తన సోదరి ఆర్తి మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో తన అక్క ఆర్తి తన గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. వీరి సోదరి ఆర్తికి ఇన్ స్టా గ్రాం రీల్స్ చేయడం అలవాటు. అది ఆమెకు వ్యసనంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె చేసే రీల్స్ మరీ సిల్లీగా ఉంటున్నాయి. దీంతో ఆకాష్ స్నేహితులు వెక్కిరించడం మొదలు పెట్టారు. 

ఆకాష్ ను అతని అక్కను ఎగతాళి చేస్తూ మాట్లాడడం ప్రారంభించారు. దీంతో అక్కతో రీల్స్ చేయించడం ఆపించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె రీల్స్ చేస్తుంటే అడ్డుకున్నాడు. దీంతో కోపానికి వచ్చిన ఆర్తి అతని మీద విచక్షణా రహితంగా దాడి చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన అతని సోదరుడు జైకిషన్ అతనిని రక్షించడానికి వచ్చాడు. ఆమె అతనిని కూడా వదిలిపెట్టలేదు. దాడి చేసింది. తమ తండ్రి బాదం సింగ్‌తో కూడా సోదరి ప్రవర్తపై చాలాసార్లు చెప్పానని ఆకాష్ చెప్పాడు.

ఆర్తి యాప్‌కు బానిస కావడం వల్లే తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందని.. ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారని ఆయన అన్నారు. "ఆమె యాప్‌ వాడకంలో పరిమితులు దాటిపోవడంతో ఆమె సోదరులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనికోసం ఆమెతో మాట్లాడారు కూడా.. కానీ ఆర్తి యాప్‌ను విడిచిపెట్టడానికి నిరాకరించిందని, ఈ క్రమంలోనే ఆదివారం, ఆమె తన సోదరుడిని చంపడానికి ప్రయత్నించిందని.." ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios