భార్య ఉండగానే రెండో పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు.. పెళ్లి చేసుకుని ఏకంగా రిసెప్షన్ కి కూడా సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన భార్య అక్కడికి చేరుకోవడంతో తాను విడాకులిచ్చానని చెబుతున్నాడు.. అయితే...
అనంతపురం : andhrapradesh రాష్ట్రంలోని అనంతపురంలో ఓ భార్య.. తన భర్త తానుండగా second marriage చేసుకుంటున్నాడు అని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే సదరు భర్త ఆమెకు talak చెప్పాకే తాను రెండో వివాహం చేసుకున్నానని చెబుతున్నాడు. ఆ తలాక్ కు తాను ఒప్పుకోలేదని.. ఆమె చెబుతోంది. వివరాల్లోకి వెడితే.. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్ బీకి ఆళ్లగడ్డ మండలానికి చెందిన నాగరాజుకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ళ పాప ఉంది. పెళ్లైన కొద్ది కాలానికి వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. గత కొంతకాలంగా వీరి వివాదం నేపథ్యంలో కోర్టులో కేసు కూడా నడుస్తోంది.
ఈ నేపథ్యంలో నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అంతేకాదు సోమవారం నగరంలోని హోటల్ లో పెళ్లి రిసెప్షన్ కూడా చేసుకోవడానికి ఏర్పాటు జరిగాయి. కాగా విషయం తెలిసిన మొదటి భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. అక్కడే మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను విచారించారు. కాగా నాగరాజు అనే భర్త... తాను మొదటి భార్యకు తలాక్ చెప్పిన తర్వాతనే రెండో వివాహం చేసుకున్నానని వాదిస్తున్నాడు. అయితే ఈ తలాక్ కు తాను అంగీకరించలేదని మహిళ చెబుతోంది.
ఇదిలా ఉండగా, మార్చి 18న ఇలాంటి రెండోపెళ్లి ఘటనే తమిళనాడులో కలకలం రేపింది. పెళ్లి జరిగిన ఒక నెల రోజుల్లోనే భర్తను కాదనుకున్న ఓ యువతి తన ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న ఘటన సంచలనం రేపింది. Thiruvannamalai జిల్లా వేంగికాల్ గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన బంధువుల యువకుడితో పెద్దలు సంబంధం కుదిర్చి నెల కిందట వివాహం జరిపించారు. అయితే, పెళ్లి అయినప్పటి నుంచి ఆమె మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మంగళవారం ఉదయం ఇంట్లో ఉన్న యువతి ఉన్న ఫలంగా కనిపించుకుండా మాయమయ్యింది. దీంతో ఆ యువతిని భర్తతో పాటు బంధువులు ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు.
ఇదిలా ఉండగా ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తన loverని వివాహం చేసుకుని వెళ్లిపోయినట్లు తెలియడంతో భర్తతో పాటు బంధువులు అవాక్కయ్యారు. రెండో వివాహం చేసుకున్న ఆ యువతి ప్రియుడితో కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తిరువణ్ణామలై తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడి పోలీసులు ఈ విషయాన్ని కోర్టులో నిర్ణయించుకోవాలని సలహా ఇచ్చి పంపారు. కాగా, విషయం తెలిసిన బంధువులు, గ్రామస్తులు మాత్రం పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ.. ఇలా పెళ్లైన తరువాత పారిపోవడం ఏమిటని.. అత్తింటి పరువు తీయడం ఏమిటని విసుగు పడుతున్నారు.
కాగా, నిరుడు నవంబర్ లో ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో జరిగింది. నాలుగైదు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా కల్యాణ మండపం నుంచి వధువు పరారయ్యింది. మరో వ్యక్తి పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి పెద్దలు నెల క్రితం వివాహం నిశ్చయం చేశారు. శనివారం రాత్రి స్థానిక marriage hallలో విందు ఏర్పాటు చేసి అక్కడే వధూవరులకు నలుగు పెట్టారు. ఆదివారం ఉదయం 5.30 గంటలు పెళ్లి జరగాల్సి ఉంది. కాగా, శనివారం అర్థరాత్రి bride మండపం నుంచి వెళ్లిపోయింది.
