Asianet News TeluguAsianet News Telugu

అనుమానం పెనుభూతమై.. పెళ్లైన ఆర్నెళ్లకే భార్యను చంపిన భర్త...

భార్య అందంగా ఉండడంతో అనుమానించిన ఓ సైకో భర్త.. పెళ్లైన ఆర్నెళ్లకే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత అక్కడినుంచి పారిపోయాడు. 

husband killed wife after six months of marriage in karnataka - BSB
Author
First Published Jan 17, 2023, 9:17 AM IST

బెంగళూరు : పెళ్లైన ఆరునెలలకే అనుమానంతో ఓ భర్త భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని తావరకెరెలో ఉణ్న సుభాష్ నగర లో ఈ దారుణ ఘటన జరిగింది. నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తికి నాజ్(22)అనే మహిళతో ఆర్నెళ్ల క్రితం వివాహం అయ్యింది. ఆ తరువాత వీరిద్దరూ బీటీఎం లేఔట్ పరిధిలోని మడివాళ వార్డు సుభాష్ నగరలో కాపురం ఉంటున్నారు. 

నాజ్ చాలా అందగత్తె. ఇదే నాసిర్ లో అనుమానానికి బీజం వేసింది. భార్య అందాన్ని చూసి సంతోషపడాల్సింది పోయి ఈర్ష్య పడ్డాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే నాసిర్ క్రమంగా ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. ఇతరులతో ఆమెకు సంబంధాలున్నాయని అనుమానించేవాడు. నిత్యం ఇదే అనుమానంతో అది పెనుభూతంగా మారింది. దీంతో ఆదివారం ఆమె గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తరువాత ఈ విషయాన్ని నాజ్ అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. నీ చెల్లి చనిపోయిందిన అని చెప్పాడు. ఆ తరువాత పరారయ్యాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం చూడగా.. అతను అప్పటికే పరారయ్యడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. 

షాకింగ్ : పది రూపాయల కోసం ఇద్దరి మీద, ఏడు రౌండ్ల కాల్పులు..

ఇదిలా ఉండగా, తెలంగాణలోని హనుమకొండలో నిరుడు ఆగస్ట్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతమై.. పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే భార్యను గొడ్డలితో నరికి చంపి.. భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..  ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్ (26)కు ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేటకు చెందిన నాగేశ్వరరావు శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె  పుష్పలీల(19)తో జూన్ 15న వివాహం అయింది. హరీష్ కు సోదరుడు, అక్క ఉన్నారు. తల్లి పదేళ్ల కిందటే మృతి చెందింది. తండ్రి కూలీ పనులు పనిచేస్తుంటాడు. 

పెళ్లయినప్పటి నుంచి పుష్పలీలపై అనుమానం పెంచుకున్న హరీష్ శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో వారికి ఎందుకు చెప్పావ్ అంటూ ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి వారిని కలిపారు. కాగా పుష్పలీల ఫోన్ లో తన తల్లిదండ్రులతో మాట్లాడితే ఇంక ఎవరితోనో మాట్లాడుతుంది.. అని అనుమానం పెంచుకున్న హరీష్ వేధింపులు ఇంకా ఎక్కువ చేశాడు.  

ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన హరీష్  రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆమె నిద్రకుపక్రమించిన సమయంలో గొడ్డలతో మెడపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత బయటకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగు వారు గమనించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. కుమార్తెను కడసారి చూసేందుకు వద్దామన్నా ఆ నిరుపేద తల్లిదండ్రుల దగ్గర బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. దీంతో బంధువులు ఫోన్ పే లో అక్కడున్న వారికి డబ్బులు పంపిస్తే సాయంత్రానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios