భార్యతో చేతబడి చేయించాడని భర్త హత్య.. ఏడుగురి అరెస్ట్..
భార్యతో చేతబడి చేయించి.. తన కుటుంబంలో ఇద్దరిని హత్య చేయించాడని ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జార్కండ్ : జార్ఖండ్ లో చేతబడి ఆరోపణలు ఓ వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఖుంటి జిల్లాలో ఒక కుటుంబంలో ఇద్దరు మరణించారు. వారి మరణాలకు కారణం.. ఓ వ్యక్తి భార్య మంత్రవిద్యే అని అనుమానంతో భర్త ను హత్యచేశారు. ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఒక వ్యక్తిని తన భార్య చేత చేతబడి చేయించి ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
గత నెలలో ప్రధాన నిందితుడు మదన్ ముండా కుటుంబంలో ఇద్దరు మృతి చెందారు. అతని పెద్ద కుమారుడు చెరువులో మునిగి చనిపోగా, అతని కోడలు అనారోగ్యంతో మరణించింది. కొన్ని రోజుల తర్వాత, అతని చిన్న కొడుకు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
మదన్ ముండా తన కుటుంబంలో జరుగుతున్న ఈ ఆకస్మిక మరణాలకు కారణం కనుగొనడానికి ఓజా రామ్ అనే తాంత్రికుడిని (షామన్) సంప్రదించాడు. వారి పొరుగున ఉన్న బిరస్మతి దేవి అనే మహిళ అతని కుటుంబ సభ్యులను చంపడానికి మంత్రవిద్యను ఉపయోగించిందని ఓజా అతనికి చెప్పాడు.
దీంతో.. నిందితులు, మహిళను, ఆమె భర్తను హత్య చేయాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 3న వారి ఇంటికి వెళ్లారని పోలీసులు తెలిపారు. అతడితో పాటు మరికొందరు కూడా ఉన్నారు. అయితే మహిళ, ఆమె భర్త ఇద్దరూ ఇంట్లో లేరు. వారు ఇంటికి తిరిగి వచ్చాక.. ఈ బెదిరింపుల గురించి విన్న వెంటనే, బిరస్మతీ దేవి తన ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రామం నుండి పారిపోయింది. అయితే ఆమె భర్త భాను ముండా మాత్రం గ్రామంలోనే ఉండేందుకు ఇష్టపడ్డాడు.
అదే రోజు రాత్రి నిందితులు గుంపుగా కలిసి భాను ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న భానును గొంతు నులిమి హత్య చేశారు. భాను కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓఝా రామ్ ముండా, మదన్ ముండా, సుఖ్‌రామ్ ముండా, గురువా ముండా, రుషు ముండా, బలే ముండా, సాము ముండా అనే ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ అరెస్టు చేసిన నిందితులందరూ విచారణలో హత్యలో తమ ప్రమేయం ఉందని అంగీకరించారు. నిందితుల నుంచి హత్యాయుధం, రక్తంతో తడిసిన చొక్కా, తాంత్రిక ఓజా త్రిశూలం, మంత్రాలు, పూజలకు సంబంధించిన పలు వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మంత్రవిద్య నిషేధంలోని సెక్షన్ 302/34, 3/4 కింద మంత్రవిద్య ఆరోపణలతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.