Asianet News TeluguAsianet News Telugu

దళిత యువతిపై ముస్లిం యువకుల సామూహిక అత్యాచారం.. వీడియో తీసి, కాబోయే భర్తకు పంపి..రూ. 5 లక్షలు డిమాండ్

దళిత సామాజికవర్గానికి చెందిన యువతిపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వీడియో కూడా తీశారు. రూ.5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ వీడియోను యువతి కాబోయే భర్తకు పంపించారు.

Dalit girl gang-raped by Muslim youths Take the video and send it to the future husband..Rs. 5 lakhs demand..ISR
Author
First Published Sep 8, 2023, 12:11 PM IST

దళిత సామాజికవర్గానికి చెందిన ఓ యువతిపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువుకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను వారు వీడియో కూడా తీశారు. అనంతరం ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఆ వీడియోను ఆమెకు కాబోయే భర్తకు పంపించి, రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 

పోలీసులు, ‘ఇండియా టు డే’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బరేలీ జిల్లాకు చెందిన ఓ దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలికి కొంత కాలం కిందట డబ్బును అప్పుగా ఇచ్చింది. అయితే దానిని తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో ఆమెను ఓ కేఫ్ కు రావాలని ఆహ్వానించింది. అక్కడికి వెళ్లే సరికి ఆమెతో పాటు ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఒకరు బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా.. మరొకరు బార్బర్ గా పనిచేసే నజీమ్. 

అక్కడి నుంచి వారంతా ఓ హోటల్ కు వెళ్లారు. ఆ హోటల్ గదిలో ఆమెతో యువకులు బీఫ్ తినిపించారు. అనంతరం ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దుశ్చర్యను వారు వీడియో కూడా తీశారు. ఆ వీడియో ఆధారంగా రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. 

ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆ వీడియోను యువతి కాబోయే భర్తకు పంపించాడు. అనంతరం నజీమ్ కాశ్మీర్ కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios