రైల్వే స్టేషన్ లో జరిగిన చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఓ జంటను నిందితులుగా నిలబెట్టింది. మహిళ మొహంపై బ్రష్ చేసుకున్న వ్యక్తిని ఆమె భర్త నెట్టేశాడు. 

ముంబై : ముంబై సబర్బన్ రైల్వేస్టేషన్ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 26యేళ్ల వ్యక్తికి మహిళతో జరిగిన వాగ్వాదంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. మహిళతో వాగ్వాదం పెట్టుకోగా, ఆమె భర్త ఆ యువకుడిని కొట్టడంతో పట్టుతప్పి పట్టాలపై పడిపోయాడా యువకుడు. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రైన్ అతడి మీదినుంచి దూసుకుపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. 

వివరాలలోకి వెడితే... ముంబై సబర్బన్ సియోన్ రైల్వే స్టేషన్‌లో మహిళా ప్రయాణికురాలితో 26 ఏళ్ల వ్యక్తికివాగ్వాదం జరిగింది. దీంతో ఆ మహిళ భర్త అతడిగి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బతో అతను బ్యాలెన్స్ కోల్పోయి రైలు ట్రాక్‌పై పడ్డాడు. బెస్ట్ బస్ కండక్టర్ అయిన దినేష్ రాథోడ్ అనే ఆ యువకుడు.. సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీలోకి రాహుల్‌ గాంధీ.. నామినేట్ చేసిన లోక్‌సభ స్పీకర్..

గవర్నమెంట్ రైల్వే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దినేష్ మృతికి కారకులైన భార్యాభర్తలు అవినాష్ మానె (31), శీతల్ మానె (30) లను ఒక రోజు తర్వాత అరెస్టు చేశారు. వారిపై 'ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలనే ఉద్దేశంతో కాదని..దాడి ' అభియోగాలు మోపారు.

పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కెమెరాల్లో రాథోడ్ ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తున్నాడు. లేడీస్ కంపార్ట్‌మెంట్ అని ఉన్న ప్రాంతానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు. అక్కడ ఉన్న ఓ మహిళకు అతి దగ్గరగా అతను బ్రష్ చేసుకుంటున్నాడు. దీంతో ఆ మహిళ అతడిని గొడుగుతో కొట్టింది. 

అది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఇది ఇలా కొనసాగుతుండగా కొంత దూరంలో నిల్చున్న ఆమె భర్త అందులో జోక్యం చేసుకున్నాడు. ఆ వ్యక్తి రాథోడ్ ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బ చాలా బలంగా ఉండడంతో రాథోడ్ బ్యాలెన్స్ కోల్పోయి రైలు ట్రాక్‌పై పడ్డాడు. అతను పడినవైపే ఓ రైలు వస్తోంది. ఇది గమనించిన రాథోడ్ ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కడం కోసం త్వరత్వరగా లేచి వెళ్లడానికి ప్రయత్నించారు. 

కానీ అతను వెళ్లేలోపే రైలు అతనిపైకి దూసుకెళ్లింది.. అని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఈ షాకింగ్ ఘటనలో దినేష్ కి అనేక గాయాలు అయ్యాయి. దీనికి కారణమైన ఆ జంటపై 'ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు.. కానీ హత్య' కింద కేసు నమోదు చేయబడింది. మృతుడు దినేష్ రాథోడ్ ఘన్సోలీ నివాసి. బెస్ట్ బస్ కండక్టర్‌గా పనిచేశాడు. ఆగస్ట్ 13న, రాత్రి 9.12 గంటలకు సియోన్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లో డౌన్ స్లో లోకల్ అతనిపైకి దూసుకెళ్లిందని, తీవ్ర గాయాలపాలైనట్లు జీఆర్పీకి సమాచారం అందింది.

పోలీసుల బృందం రాథోడ్‌ను సియోన్‌లోని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆగస్టు 14వ తేదీ తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో దినేష్ మృతి చెందాడు.ఆయన మృతదేహాన్ని అతనితో పాటు ఉండే తమ్ముడు విక్రమ్ (19)కి అప్పగించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరణానికి కారణం 'ఛాతీ, పొత్తికడుపుకు భారీగాయాలు, న్యుమోథొరాక్స్‌తో రక్తస్రావం' అని పేర్కొంది.

ఘటనానంతరం దంపతులు పారిపోయారు. వీరిని క్రైం బ్రాంచ్ పోలీసులు ఆగస్టు 15న అరెస్ట్ చేశారు. అవినాష్ హౌస్ కీపింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా, శీతల్ గృహిణి అని పోలీసులు తెలిపారు. దంపతులు మన్‌ఖుర్డ్‌లో నివాసం ఉంటున్నారు. “అంత బలంగా దెబ్బ కొడితే రాథోడ్ పట్టాలపై పడిపోతాడని, రైలు ఢీకొని ప్రాణాలు పోవచ్చని అవినాష్‌కు తెలుసు. ఈ కేసులో కీలక సాక్ష్యమైన శీతల్ గొడుగును స్వాధీనం చేసుకునేందుకు మూడు రోజుల పోలీసు కస్టడీకి అభ్యర్థించాం’’ అని కోర్టులో సమర్పించిన పోలీసు రిమాండ్ దరఖాస్తులో పేర్కొన్నారు.