అతి త్వరలో ట్రిపుల్ తలాక్ చట్టం.. రోటీ మాడిందని భార్యకు తలాక్

husband given triple talaq to women over Burnt Chapati at Uttarpradesh
Highlights

ముస్లిం మహిళల జీవితాలతో ఆటలాడుతూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న ట్రిపుల్ తలాక్‌ విధానాన్ని పారదోలేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. దేశంలో ట్రిపుల్ తలాక్‌లు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా రోటీ మాడిపోయిందనే చిన్న కారణంతో భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పాడు ఓ భర్త

ముస్లిం మహిళల జీవితాలతో ఆటలాడుతూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న ట్రిపుల్ తలాక్‌ విధానాన్ని పారదోలేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. దేశంలో ట్రిపుల్ తలాక్‌లు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా రోటీ మాడిపోయిందనే చిన్న కారణంతో భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పాడు ఓ భర్త...

ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలోని పహ్రెతా గ్రామానికి చెందిన ఓ జంటకు ఏడాది క్రితం పెళ్లయ్యింది. ఈ క్రమంలో ఇవాళ రోటీ మాడిపోయిందని భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు ఆ భర్త..అంతేకాకుండా దీనికి మూడు రోజుల ముందు నుంచి తనను సిగరెట్లతో కాలుస్తున్నాడని.. తీవ్రంగా హింసిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తపై గృహహింస కేసు నమోదు చేశారు.


 

loader