అత్తింటి వేధింపులు తట్టుకోలేక నిప్పంటించుకున్న భార్యను వీడియో తీసి ఆమె తల్లిదండ్రులకు పంపిన దారుణ ఘటన జైపూర్ లో జరిగింది. రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు, భర్త పెడుతున్న హింస తట్టుకోలేక ఈ నెల 20న ఆత్మహత్య చేసుకుంది.

ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మంటల బాధకు తట్టుకోలేక కేకలు పెడుతుంటే.. అదంతా చూస్తున్న భర్త, అక్కడే ఉండి భార్య కేకలు విని కూడా పట్టించుకోలేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే కనీసం కాపాడే ప్రయత్నం చేయకపోగా భార్య మంటల్లో మాడిపోవడాన్ని ఫోన్ లో చిత్రీకరించారు.

ఆ తరువాత ఆ వీడియోను ఆమె తల్లిదండ్రులకు పంపాడు. పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఆమె జైపూర్ ఆస్పత్రిలో చికిత్ర తీసుకుంటూ 22వ తేదీన చనిపోయింది. ఆ తరువాతే విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు గురువారం భర్త, అత్తామామలపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.