విడాకుల కేసులో తనకు న్యాయం జరగడం లేదని.. గత ఆరేళ్లుగా కేసు సాగుతోందని అసంతృప్తి చెందిన ఓ భర్త జడ్జి కారును ధ్వంసం చేశాడు.
కేరళ : కోర్టులో తనకు అన్యాయం జరిగిందని ఓ భర్త కోపాన్ని జడ్జి మీద తీర్చుకున్నాడు. ఆరేళ్లుగా విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతూ ఉండడంతో అసంతృప్తితో రగిలిపోయాడు. తనకు సహజ న్యాయం దక్కడం లేదని ఆవేదన చెందాడు. తన కోపాన్ని కోర్టు బయట ఉన్న జడ్జి కారు మీద చూపించాడు. కోర్టుకు హాజరైన భర్త విడాకుల వ్యవహారంలో విని బయటకి రాగానే ఎదురుగా జడ్జి కారు కనిపించింది.
అంతే అతని కోపం నషాలానికి అంటింది. ఆరేళ్లుగా తన విడాకుల వ్యవహారాన్ని తేల్చకుండా విసిగిస్తున్నాడు అన్న కోపంతో కారు అద్దాలన్నీ పగలగొట్టాడు. కారు మొత్తం నొక్కులు పడేలా దాడికి దిగాడు. ఈ ఘటన బుదవారం కేరళలోని పథనం తిట్ట జిల్లా తిరువళ్లా కోర్టు దగ్గర జరిగింది. కోర్టు ఆవరణలో దాడి జరగడంతో వెంటనే గమనించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా మహిళా జైలులో గ్యాంగ్ వార్.. 41మంది ఖైదీల మృతి...
అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తిరువళ్లా పోలీసు అధికారులు తెలిపారు. ‘అతని మీద భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. న్యాయవాది, న్యాయమూర్తి కుమ్మక్కయ్యారు. తన గోడును సరిగ్గా వినిపించుకోవడం లేదనేది నిందితుడి వాదన. అదే కోపానికి కారణం’ అని పోలీసులు తెలిపారు.
కోర్టు పనికి అంతరాయం కలిగించడం, బెదిరింపులు, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తిరువల్ల పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. "తన భార్య, న్యాయవాది, న్యాయమూర్తి కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. తన వాదన సరిగా వినిపించుకోవడం లేదని అతను ఆరోపించాడు" అని అధికారి చెప్పారు.
మొదట 2017లో పతనంతిట్టలోని కోర్టులో దంపతుల మధ్య కేసు విచారణ జరిగిందని.. అయితే ఆ కోర్టుపై తనకు నమ్మకం లేదని పేర్కొంటూ దానిని బదిలీ చేయాలని ఆ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడని అధికారి తెలిపారు. "తర్వాత, దంపతుల మధ్య ఉన్న కేసులు ఈ సంవత్సరం కుటుంబ న్యాయస్థానానికి బదిలీ చేయబడ్డాయి" అని తెలిపారు.
