Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ గేమ్స్ వ్యసనం.. అప్పులపాలై భార్యాపిల్లలను చంపి.. వ్యక్తి ఆత్మహత్య...

కోయంబత్తూర్ కు చెందిన మణికంఠన్ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. రెండు నెలలుగా పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆన్లైన్ లో నగదు పెట్టి గేమ్ లు ఆడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. డిసెంబర్ 31న రాత్రి ఘర్షణ కూడా పడ్డారు. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి మణికంఠన్ ఆత్మహత్య  చేసుకున్నాడు.

Husband commits suicide after killing wife, children over online games addiction in chennai
Author
Hyderabad, First Published Jan 3, 2022, 10:01 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చెన్నై: Online games వ్యసనం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. సరదాగా మొదలై వ్యసనంగా మారి...అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల నిండు జీవితాలు మొదలు కాకుండానే ఆగిపోయేలా చేశాయి. ఏ పనీ చేయకుండా, గేమ్ లకు బానిసై, అప్పులపాలై.. భార్య, పిల్లలు ఉసురు తీశాడో వ్యసనపరుడు. ఈ విషాద ఘటన Tamil Naduలో కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే...

ఆన్లైన్ గేమ్ లకు బానిసై పనికి వెళ్లకుండా, అప్పుల పాలైన ఓ వ్యక్తి… భార్య, ఇద్దరు పిల్లలను Murderచేసి Suicideకు పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నైలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరుంగుడి పెరియార్ లోని ఓ అపార్ట్మెంట్లో మణికంఠన్  (36), తార(35)  దంపతులు నివసిస్తున్నారు.  వీరి కుమారులు  ధరణ్ (10),  దహాన్ (1)  ఉన్నారు. 

కోయంబత్తూర్ కు చెందిన మణికంఠన్ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. రెండు నెలలుగా పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆన్లైన్ లో నగదు పెట్టి గేమ్ లు ఆడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. డిసెంబర్ 31న రాత్రి ఘర్షణ కూడా పడ్డారు. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి మణికంఠన్ ఆత్మహత్య  చేసుకున్నాడు.

ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Unemployment: నిరుద్యోగ భార‌తం.. జాతీయ‌ నిరుద్యోగ రేటు ఎంతో తెలుసా?

ఇదిలా ఉండగా, ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. 2021, మే 4న ఓ యువకుడు ఇలాగే మృత్యువాత పడ్డాడు. ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారిన ఓ యువకుడు.. వాటి కారణంగా ఏకంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారడంతో మానసిక సమస్యలను కొనితెచ్చుకున్నాడు. ఆరోగ్యం పూర్తిగా పాడవ్వడంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ ఏజెన్సీ పాడేరులోని నీలకంఠంనగర్‌(చాకలిపేట)లో నివాసముంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు సంకు శంకరరావు కుమారుడు జయకుమార్‌(19) పబ్జీ గేమ్‌తో పాటు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. వీటి వల్ల గతేడాది మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లి మానసిక నిపుణులతో చికిత్స చేయించారు.

మందులు వాడుతుండడంతో అతని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇటీవల ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడిన జయకుమార్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జయకుమార్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుచోట్ల గాలించినా.. ఆచూకీ లభించలేదు.

సోమవారం ఉదయం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద బావిలో జయకుమార్‌ మృతదేహం బయటపడింది. బావి గట్టుపై జయకుమార్‌ ఫోన్‌ ఉండడంతో స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాన్ని బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios