Asianet News TeluguAsianet News Telugu

Unemployment: నిరుద్యోగ భార‌తం.. జాతీయ‌ నిరుద్యోగ రేటు ఎంతో తెలుసా?

Unemployment: దేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది. 2021 సెప్టెంబర్‌ నుంచి క్ర‌మంగా నిరుద్యోగ రేటు పెరుగుతోంద‌ని తెలిపింది. తాజాగా విడుద‌లైన సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) నివేదిక ప్ర‌కారం..దేశంలో 7.91 శాతం నిరుద్యోగం రేటు నమోదు కాగా, అందులో పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.28 శాతం గా న‌మోదైన‌ట్టు సిఎంఐఇ వెల్లడించింది. 
 

telangana unemployment rate 2. 2 percent says cmie
Author
Hyderabad, First Published Jan 3, 2022, 4:59 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

Unemployment: దేశ వ్యాప్తంగా నిరుద్యోగం తాండవిస్తోంది. ఈ స‌మ‌స్య సమీప భవిష్యత్తులో ఓ మహాఉద్యమంలా మార‌నున్న‌ది. సిఎమ్ఐఇ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ) విడుద‌ల చేసిన నిరుద్యోగ గ‌ణాంకాలు పరీశీలిస్తే.. దేశంలో ఎంత‌మంది ఉపాధిలేక రోడ్డున పడిన‌ట్టు తెలుస్తోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్ర‌కారం.. 2021 డిసెంబర్‌ చివరినాటికి దేశ వ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతం గా న‌మోదైన‌ట్టు వెల్ల‌డించింది. 2021 సెప్టెంబర్‌ నుంచి ప్ర‌తి నెల  నిరుద్యోగ రేటు పెరుగుతోందని, అందులో పట్టణ నిరుద్యోగం మరింతగా పెరిగిందని తెలిపింది. పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం న‌మోదు కాగా,  గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. 

గ‌త త్రైమాసికంలో (2021 సెప్టెంబర్‌లో) దేశ నిరుద్యోగ రేటు 6.86 శాతంగా నమోదు కాగా, అందులో పట్టణ నిరుద్యోగ రేటు 8.62 శాతంగా, గ్రామీణ నిరుద్యోగ రేటు 6.06 శాతంగా రికార్డు అయినట్లు నివేదిక తెలిపింది. క‌రోనా ప్ర‌భావం .. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల వ‌ల్ల క్ర‌మంగా నిరుద్యోగ రేటు క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుంది. 2021 అక్టోబర్‌ నాటికి దేశంలో నిరుద్యోగం రేటు 7.75 శాతానికి న‌మోదు కాగా... అందులో పట్టణ నిరుద్యోగ రేటు 7.38 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.91 శాతానికి పెరిగింది. 

Read Also:  gangula on bandi sanjay : బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదు .. గంగుల ఫైర్

అలాగే.. 2021 నవంబర్‌లో క‌రోన సెకండ్ వేవ్ త‌గ్గడం , సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో నిరుద్యోగ రేటులో కాస్త త‌గ్గుద‌ల న‌మోదు అయ్యింది. దేశ‌వ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7 శాతం గా న‌మోద‌య్యింది. ఇదే స‌మ‌యంలో  పట్టణ నిరుద్యోగ రేటు 8.21 శాతం గా న‌మోదు కాగా.. గ్రామీణ నిరుద్యోగ రేటు 6.44 శాతం నమోదైంది. 

జాతీయ సగటుతో పోలిస్తే.. బీజేపీ పాలిత రాష్ట్ర‌మైన హర్యానా లో అధికంగా  34 శాతంతో నిరుద్యోగంలో అగ్రభాగాన నిలిచింది. ఆ తరువాత .. రాజస్థాన్‌ (27.1 శాతం), జార్ఖండ్‌ (17.3 శాతం), బీహార్‌ (16 శాతం), జమ్ముకాశ్మీర్‌ (15 శాతం), గోవా (12 శాతం), త్రిపుర (14.7 శాతం), ఢిల్లీ (9.8 శాతం), హిమాచల్‌ప్రదేశ్‌ (9.4 శాతం) న‌మోద‌న‌ట్టు తెలిపింది.  

Read Also: Omicron ఎఫెక్ట్: బెంగాల్‌లో రేపటి నుండి విద్యా సంస్థల మూసివేత

తెలుగు రాష్ట్రాల్లో తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. అయితే జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే న‌మోదైంది.ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, తెలంగాణలో 2.2 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. దక్షిణాదిలో కర్ణాటకలో 1.4 శాతం సీఎంఐఈ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios