Asianet News TeluguAsianet News Telugu

జమ్మూలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. మినీ బస్సులో ఐఈడీని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు..

జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ ప్రాంతంలోని ఓ మినీ బస్సులో భారీ స్థాయిలో ఐఈడీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం దానిని నిర్వీర్యం చేశాయి. 

Huge terror conspiracy foiled in Jammu Security forces recovered IED from mini bus.
Author
First Published Nov 26, 2022, 9:03 AM IST

జమ్మూలో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారం రాంబన్ ప్రాంతంలో సిబ్బంది ఓ బస్సును అడ్డగించి, దానిలో నుంచి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు.

దారుణం... సవితి పిల్లలకు చికెన్ లో విషం కలిపి తినిపించిన మహిళ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

దీనిపై రాంబన్ ఎస్ఎస్పీ మోహిత శర్మ మాట్లాడుతూ.. నశ్రీ నాకా సమీపంలో ఓ వాహనంలో అనుమానాస్పద వస్తువు దొరికిందని, దీనిపై పోలీసులకు అనుమానం వచ్చిందని తెలిపారు. అందులో ఉన్నవారిని ఖాళీ చేయించారని చెప్పారు. అనంతరం ఘటనా స్థలానికి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ టీం ను పిలిపించి ప్యాకెట్‌ను తనిఖీ చేశారు. ప్యాకెట్‌లో ఐఈడీ ఉన్నట్లు వారు నిర్ధారించారని అన్నారు. ఈ మినీ బస్సు దోడా వైపు వెళుతోందని మోహిత శర్మ తెలిపారు.

అదర్ పూనావాలా ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి రూ. కోటి చీటింగ్.. ఏడుగురి అరెస్ట్..

బస్సులో దొరికిన పేలుడు పదార్థాన్ని సీఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఆధ్వర్యంలో సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లి, ఐఈడీని పేల్చారు. ఇందులో ప్రమేయం ఉన్న నిందితుల అరెస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

ఇలాంటి ఘటనే అక్టోబర్ లో కూడా వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ పేలుడు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాదులు దాదాపు 16 కిలోల బరువున్న రెండు గ్యాస్ సిలిండర్లతో ఐఈడీని అమర్చారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని అస్టాంగో ప్రాంతంలో పోలీసులు, సైన్యానికి చెందిన సంయుక్త బృందం ఐఈడీని గుర్తించింది. డిస్పోజల్ స్క్వాడ్ టీం దానిని నిర్వీర్యం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios