పార్లమెంట్‌లో దాడి.. గ్యాస్ లీక్ చేస్తూ కలకలం.. ఏం జరిగింది?

security breach in Lok Sabha: పార్ల‌మెంట్ లో భారీ భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న చోటుచేసుకుంది. లోక్ సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలు చూస్తుండగానే ఇద్దరు వ్య‌క్తులు స్పీకర్ వెల్ లోకి దూక‌డంతో పాటు ఒక ర‌క‌మైన గ్యాస్ ను విడుద‌ల చేయ‌డం క‌ల‌కలం రేపుతోంది. 22 ఏళ్ల క్రితం జరిగిన దాడి రోజే మరోసారి ఇలా జరగడంపై భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
 

Huge Parliament Security Breach: Man Jumps Into Lok Sabha, Here are the full details RMA

security breach in parliament: బుధవారం మధ్యాహ్నం 1.02 గంటలకు పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని పసుపు రంగులో గ్యాస్ ను వెదజల్లుతున్న పొగ డబ్బాలతో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి లోక్ సభ ఛాంబర్ లోకి దూసుకెళ్లడంతో భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ముదురు నీలం రంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి పట్టుబడకుండా తప్పించుకునేందుకు డెస్క్ లపైకి దూకుతుండగా, రెండో వ్యక్తి సందర్శకుల గ్యాలరీలో గ్యాస్ లీక్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు హౌస్ సీసీటీవీ రికార్డయ్యాయి. వీరిద్దరినీ లోక్ సభ ఎంపీలు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

22 ఏళ్ల క్రితం పార్ల‌మెంట్ పై దాడి జ‌రిగిన రోజునే మ‌ళ్లీ.. 

పాత పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయింది. ఈ క్ర‌మంలోనేలోక్‌సభలో బుధవారం భద్రతా ఉల్లంఘన చోటుచేసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది. 2001 పార్లమెంట్ దాడి వార్షికోత్సవం సందర్భంగా లోక్ స‌భ‌లో భ‌ద్రతా ఉల్లంఘ‌న జ‌రిగింది. దీంతో మ‌రోసారి పార్ల‌మెంట్ భద్రతా ఉల్లంఘనపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఇద్దరు యువకులు గ్యాలరీ నుంచి దూకారనీ, టియర్ గ్యాస్ లాంటిది వెదజల్లుతూ ఏదో వస్తువు విసిరారనీ, వారిని ఎంపీలు పట్టుకోవడంతో భద్రతా సిబ్బందికి అప్పగించారని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios