Asianet News TeluguAsianet News Telugu

ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం.. ఏడుగురు గల్లంతు..

ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో అందులో ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఏడుగురి ఆచూకీ తెలియరావడం లేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Huge fire in pharma factory.. Four burnt alive.. Seven dead..ISR
Author
First Published Nov 4, 2023, 11:14 AM IST

ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Nepal earthquake : నేపాల్‌లో భారీ భూకంపం : 128 మంది మృతి.. ప్రాణనష్టంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ ఎంఐడీసీ వద్ద బ్లూ జెట్ హెల్త్‌కేర్‌ అనే ఫార్మా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. అయితే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.

సీబీఐ అధికారిగా నమ్మించి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 20 లక్షలు డిమాండ్.. చివరికి

అయితే మంటలు భారీగా ఉండటంతో వాటిని అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే శనివారం ఉదయం 4 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఏడుగురికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని హాస్పిటల్స్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి.. : ఢిల్లీలో భూప్రకంపనల వేళ నిపుణుల హెచ్చరిక..

ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల మొదలయ్యాయని అధికారులు ప్రాథమికంగా అంఛనా వేశారు. తరువాత మంటలు కెమికల్స్ ఉన్న బ్యారెల్స్ వద్దకు వ్యాపించడంలో అవి పేలినట్టు తెలుస్తోంది. అయితే మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios