ఇంటర్ స్టూడెంట్స్‌కు ప్రత్యామ్నాయ విద్యా సంవత్సరం క్యాలండర్ విడుదల

దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో 11, 12 తరగతుల విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యామ్నాయ విద్యా సంవత్సరం క్యాలండర్ ను విడుదల చేసింది. 

HRD Minister announces the launch of alternative academic calendar for Class 11, 12 students


న్యూఢిల్లీ:దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో 11, 12 తరగతుల విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యామ్నాయ విద్యా సంవత్సరం క్యాలండర్ ను విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ఇంట్లో నుండే విద్యా బోధనకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

HRD Minister announces the launch of alternative academic calendar for Class 11, 12 students

కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ సందర్భంగా సందేశాన్ని విడుదల చేశారు. భారత్‌ సహా వివిధ ప్రపంచ దేశాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విద్యార్థులు, టీచర్లు ఇంటికే పరిమితమయ్యారు. ఇ- పాఠశాల, ఎన్‌ఆర్‌ఓఈఆర్‌, స్వయం, దీక్షా తదితర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలతో క్లాసులు నిర్వహిస్తున్నారు.

also read:గుండెపోటుతో అంబులెన్స్ డ్రైవర్ మృతి: తాళిబొట్టు తాకట్టు పెట్టి అంత్యక్రియలు

ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేసిన ఆల్టర్నేటివ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేశాం. ఫోన్‌, రేడియో, ఎస్‌ఎంఎస్‌, టీవీ సహా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా టీచర్లు విద్యార్థులను గైడ్‌ చేయవచ్చని ఆయన చెప్పారు. ఇంట్లోనే అన్ని రంగాల విద్యార్థులకు సరైన పద్దతిలో విద్యా బోధన జరిగేందుకు వీలుగా వెసులుబాటును కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. 

మరో వైపు ఈ క్యాలెండర్ విషయంలో ఏమైనా సలహాలు, సందేహాలు , సూచనలకు గాను director.ncert@nic. in లేదా cg ncert2019@gmail.comను సంప్రదించాలని ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios