గుండెపోటుతో అంబులెన్స్ డ్రైవర్ మృతి: తాళిబొట్టు తాకట్టు పెట్టి అంత్యక్రియలు

కరోనా నివారణలో అవిశ్రాంతంగా పనిచేస్తూ అంబులెన్స్ డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. అతని అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో అతడి భార్య మంగళసూత్రం తాకట్టు పెట్టింది.

Karnataka With no money, Covid warrior's wife forced to mortgage mangalsutra to perform his last rites

బెంగుళూరు: కరోనా నివారణలో అవిశ్రాంతంగా పనిచేస్తూ అంబులెన్స్ డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. అతని అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో అతడి భార్య మంగళసూత్రం తాకట్టు పెట్టింది.

కరోనా నివారణలో విస్తృతంగా సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్య సిబ్బందిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

 కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ జిల్లా కొన్నూర్‌కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ ఉమేష్ హదగలి రెండు నెలలుగా కరోనా విధుల్లో పనిచేస్తున్నాడు. అయితే ఆయనకు ఇటీవల గుండెపోటు వచ్చింది.

గుండెపోటుతో ఆయన మృతి చెందాడు.  ఉమేష్ అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను కుటుంబసభ్యుల వద్ద డబ్బులు లేవు.

దీంతో ఉమేష్ భార్య జ్యోతి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టింది. ఈ డబ్బులతోనే ఆమె భర్త అంత్యక్రియలను నిర్వహించింది. ఈ అంత్యక్రియల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమై బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆమెతో ఫోన్ లో మాట్లాడారు. ఉమేష్ మరణించడంతో సత్వరమే భీమా మొత్తాన్ని వచ్చేలా చూడడంతో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చాడు. 

బాధితురాలి కుటుంబానికి పరిహారం అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పిల్లల విద్యకు  అవసరమైన సహాయం చేయాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios