సారాంశం
జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏదో ఒక సమయంలో ఇది కచ్చితంగా ఉపయోగపడాల్సిందే. అయితే కొందరికీ బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలన్న దానిపై ఒక స్పష్టత ఉండదు. ఇంతకీ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి.? దీని ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏదో ఒక సమయంలో ఇది కచ్చితంగా ఉపయోగపడాల్సిందే. అయితే కొందరికీ బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలన్న దానిపై ఒక స్పష్టత ఉండదు. ఇంతకీ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి.? దీని ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బర్త్ సర్టిఫికేట్‌ను బెస్ట్ ఐడీ ప్రూఫ్‌గా చెబుతుంటారు. ప్రతీ ఒక్క భారతీయుడు కచ్చితంగా బర్త్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాల్సిందే. గతంలో దీనికి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ప్రస్తుతం కచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఐడీ ప్రూఫ్, పుట్టిన తేదీకి సంబంధించి బెస్ట్ జనన ధృవీకరణ పత్రంలో ఇది ముఖ్యమైంది. పాస్‌పోర్ట్ మొదలు స్కూలు అడ్మిషన్ల వరకు ప్రతీ ఒక్క దానికి కచ్చితంగా బర్త్ సర్టిఫికేట్స్ ఉండాల్సిందే. బిడ్డలు పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.?
1) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి CRSORGI.gov.in ని సందర్శించండి.
2) సైన్ అప్:
అనంతరం "సైన్ అప్" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ యూజర్ నేమ్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి. మీ రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన రాష్ట్రంపై క్లిక్ చేయాలి.
3) రాష్ట్ర పోర్టల్‌లో నమోదు చేసుకోండి:
మళ్ళీ "సైన్ అప్" పై క్లిక్ చేయండి. పేరు, ఇంటిపేరు, లింగం, పుట్టిన తేదీ వంటి వివరాలను ఫిల్ చేయాలి. తర్వాత నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4) చిరునామా వివరాలను అందించాలి:
మీ పూర్తి చిరునామాను ఇవ్వండి. ఇందులో రాష్ట్రం, జిల్లా, నగరం, పిన్‌కోడ్, ఇంటి నెంబర్ వంటి అన్ని వివరాలు అందించాలి. ఆ తర్వాత నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
5) ఆధార్ వివరాలు, జాతీయత:
మీ ఆధార్ నంబర్‌తో పాటు జాతీయతను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ట్స్ ఆప్షన్‌పై సెలక్ట్ చేసుకోవాలి. వెరిఫికేషన్ కోసం మీ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
6) ఇమెయిల్ ID ని ధృవీకరించండి:
OTP ఎంటర్ చేసిన తర్వాత, మీ ఇమెయిల్ ID ని ఎంటర్ చేయండి. లాగిన్ పేజీకి వెళ్లడానికి "స్కిప్ అండ్ రిజిస్టర్" పై క్లిక్ చేయండి.
7) లాగిన్ అవ్వండి:
మీ రెడిస్టర్ మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి OTPతో లాగిన్ అవ్వండి.
8) పుట్టిన వివరాలను అందించాలి:
తర్వాత పైన కుడి వైపున ఉన్న మూడు-లైన్ల మెనుపై క్లిక్ చేయండి. "జననం" సెలక్ట్ చేసుకొని "జననాన్ని నివేదించు" ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
1) పుట్టిన తేదీ వివరాలను అందించాలి:
మీరు జన్మించిన రాష్ట్రాన్ని ఎంచుకోండి (ఉదా. తెలంగాణ). డిఫాల్ట్ భాషను (ఇంగ్లీష్) ఎంచుకోండి. మీ రిజిస్ట్రేషన్ తేదీ ఆటోమేటిక్‌గా సెలక్ట్ అవుతుంది.
2) పిల్లల సమాచారాన్ని నమోదు చేయండి:
పుట్టిన తేదీ, సమయాన్ని నిర్ణయించండి. లింగం ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ అందుబాటులో ఉంటే, దానిని యాడ్ చేయాలి.
3) పేరు నమోదు చేయండి:
పిల్లల పేరు ఖరారు కాకపోతే, అందుకోసం కేటాయించిన బాక్స్‌లో టిక్ చేయాలి. పేరు ఖరారు చేస్తే మొదటి, చివరి పేరును నమోదు చేయండి.
4) తల్లిదండ్రుల సమాచారాన్ని నమోదు చేయండి:
తండ్రి వివరాలు (పేరు, ఇంటిపేరు, ఆధార్ నంబర్, ఇమెయిల్, మొబైల్ నంబర్) ఇవ్వండి. అదే విధంగా తల్లి వివరాలను ఇవ్వండి.
5) చిరునామా విరాలను ఫిల్ చేయండి:
చిరునామా స్థానంగా "భారతదేశం" ఎంచుకోండి. "తల్లిదండ్రుల చిరునామాను యాడ్ చేయి" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
6) పుట్టిన స్థలాన్ని ఎంచుకోండి:
మీరు ఎక్కడ జన్మించారో ఆ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. రాష్ట్రం, జిల్లా, నగరం, వార్డు వివరాలను ఎంటర్ చేయండి.
7) రిజిస్ట్రేషన్ యూనిట్‌ను ఎంచుకోండి:
"రిజిస్ట్రేషన్ యూనిట్", ఆసుపత్రి పేరును ఎంచుకోండి. ఆసుపత్రి జాబితాలో లేకపోతే పేరును మాన్యువల్‌గా ఎంటర్ చేయండి.
వీటితో పాటు.. తల్లిదండ్రుల నివాస చిరునామాలు , మతం, విద్యతో పాటు తండ్రి వృత్తి. ప్రసవ సమయంలో తల్లి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు. అంతకుముందు తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? డెలివరీ వివరాలు (ఆసుపత్రి రకం, డెలివరీ పద్ధతి, శిశువు జనన బరువు, గర్భధారణ వయస్సు). వివరాలను అందించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్ సైజ్ కచ్చితంగా 8 ఎంబీ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్ ఐడీ ప్రూఫ్ (పాన్ కార్డ్, ఆధార్, మొదలైనవి) ప్రభుత్వం ఆమోదించిన జనన ధృవీకరణ పత్రం ఆమోదం కోసం నెక్ట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అన్ని వివరాలను సరిగ్గా చెక్ చేసుకొని దరఖాస్తును సమర్పించాలి. ఇందుకోసం కొంత మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.