పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రా.. పరువుకు నష్టం వాటిల్లే విధంగా...మీడియా వ్యవహరిస్తోందని ఆయన భార్య సినీనటి శిల్పాశెట్టి ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. అశ్లీల చిత్రాలు తీసుకున్నారనే ఆరోపణలతో.. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. మీడియా, సోషల్ మీడియాలో ఈ వార్తలపై వరస కథనాలు వస్తున్నాయని.. వాటి వల్ల తమకు ఇబ్బందిగా ఉందని.. వెంటనే వాటిని అడ్డుకోవాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

శిల్పాశెట్టి పిటిషన్‌ను విచారణ చేపట్టిన నాయస్థానం...అలాంటి కథనాలు రాకుండా అడ్డుకోలేమని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రా.. పరువుకు నష్టం వాటిల్లే విధంగా...మీడియా వ్యవహరిస్తోందని ఆయన భార్య సినీనటి శిల్పాశెట్టి ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

పలు మీడియా సంస్థలతో పాటు ట్విట్టర్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ వంటి మాధ్యమాల్లో తమ గురించి తప్పుగా రాస్తున్నారని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. పిటిషన్‌ను శుక్రవారం విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు. భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదంటూ శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.