కన్నీరు పెట్టుకున్న సీఎం.. మహానటుడు అన్న బీజేపీ

How Congress responded to HD Kumaraswamy's tears
Highlights

తనకు తాను గరళ కంఠుడిలా అభివర్ణించుకుంటూ శనివారం ఓ సన్మాన కార్యక్రమంలో వేదికపైనే ఆయన కంటతడి పెట్టుకున్నారు కూడా. అయితే ఇదే అదనుగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సెటైర్ల వేయటం​ మొదలుపెట్టింది. 

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిపై బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కుమారస్వామిని మహానటుడుగా అభివర్ణిస్తూ.. సెటైర్లు వేస్తున్నారు. కాగా,.. వారి సెటైర్లను కాంగ్రెస్ తిప్పికొట్టడం గమనార్హం.

 ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తానేం సంతోషంగా లేననే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. పైగా తనకు తాను గరళ కంఠుడిలా అభివర్ణించుకుంటూ శనివారం ఓ సన్మాన కార్యక్రమంలో వేదికపైనే ఆయన కంటతడి పెట్టుకున్నారు కూడా. అయితే ఇదే అదనుగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సెటైర్ల వేయటం​ మొదలుపెట్టింది. ప్రజలను ఆయన పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండిపడుతోంది. 

‘మన దేశం ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను అందిస్తోంది. నటులు కూడా వారి నటనతో ఆడియన్స్‌ను మైమరిచిపోయేలా చేస్తూ.. ఆకట్టుకుంటున్నారు. ఇదిగో అక్కడ మరో దిగ్గజ నటుడు కుమారస్వామి కూడా ఉన్నారు. తన నటనా పటిమతో ఏకధాటిగా ప్రజలను మూర్ఖులను చేస్తూ వస్తున్నారు... అండ్‌ ది బెస్ట్‌ యాక్టింగ్‌ అవార్డు గోస్‌ టూ... అంటూ వ్యంగ్యంగా ఓ పోస్టును బీజేపీ ట్విటర్‌లో పోస్టు చేసింది. పైగా దానికి కుమారస్వామి కంటతడి పెట్టిన వీడియోను జత చేసింది.

దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై కుమారస్వామి సంతృప్తిగానే ఉన్నారని జేడీఎస్‌ పార్టీ కార్యదర్శి దానిష్‌ అలీ పేర్కొన్నారు. సీఎం కుమారస్వామి కేవలం భావోద్వేగంతోనే అలా కన్నీళ్లు పెట్టుకున్నారంటూ అలీ చెప్పుకొచ్చారు.

loader