Asianet News TeluguAsianet News Telugu

లక్నోలో ఇల్లు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

శుక్రవారం లక్నోలో పాత ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

House collapse in Lucknow, Five members of the same family died - bsb
Author
First Published Sep 16, 2023, 11:01 AM IST

ఉత్తరప్రదేశ్ : శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ పాత ఇల్లు కుప్పకూలడంతో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

అలంబాగ్‌లోని రైల్వే కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు  కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను సతీష్ చంద్ర (40), సరోజినీ దేవి (35), ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. దీనికి సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios