Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. బైక్ ఎక్కలేదని మహిళను హెల్మెట్ తో చితకబాదిన వ్యక్తి.. వీడియో వైరల్

తన బైక్ ఎక్కేందుకు ఒప్పుకోలేదని ఓ మహిళపై ఓ వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. హెల్మెట్ తో బలంగా కొట్టాడు. స్థానికులు కల్పించుకొని అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.  

Horrible.. A man crushed a woman with a helmet for not riding a bike.. Video went viral
Author
First Published Jan 7, 2023, 7:07 AM IST

న్యూ ఇయర్ రోజున దాదాపు 12 కిలో మీటర్ల పాటు మహిళను కారుతో ఈడ్చుకెళ్లిన ఆమె మరణానికి కారణమైన ఢిల్లీ యాక్సిడెంట్ ఘటన మరవకముందే.. మరో భయంకరమైన ఘటన ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలోని హర్యానాలో వెలుగులోకి వచ్చింది. బైక్ ఎక్కడానికి నిరాకరించిందనందుకు ఓ మహిళను ఓ వ్యక్తి హెల్మెట్ తో దారుణంగా కొట్టాడు. వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీనికి గొడవ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

ఆశ్చర్యానికి గురి చేసిన సీజేఐ.. తొలిసారి ఇద్దరు కుమార్తెలతో సుప్రీంకోర్టుకు ..

గురుగ్రామ్ ఏసీపీ మనోజ్ కే తెలిపిన వివరాల ప్రకారం.. తన బైక్‌పై ప్రయాణించడానికి నిరాకరించినందుకు కమల్ అనే వ్యక్తి తన పొరుగింట్లో నివసిస్తున్న ఓ మహిళను హెల్మెట్ తో కొట్టాడు. వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ విడుదల చేసిన ఓ వీడియో లో.. ఆటో వచ్చి గురుగ్రామ్ లోని ప్రాంతంలో ఆగింది. అందులో నుంచి ఓ మహిళ దిగుతోంది. అదే సమయంలో ఓ బైక్ అటు నుంచి వచ్చింది. ఆ మహిళ, కమల్ కొంత సేపు మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఆ బైక్ ను కొంత ముందుకు తీసుకెళ్లి పక్కన ఆపేసి హెల్మెట్ తీస్తూ మహిళ దగ్గరకు వచ్చాడు.

క్షణాల్లోనే వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆగ్రహంతో కమల్ తన హెల్మెట్ తీసి మహిళపై దారుణంగా దాడి చేశాడు. కోపంతో చితకబాదాడు. దీంతో చుట్టుపక్కల వారు, ఆటో డ్రైవర్ కలుగజేసుకున్నారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతి కష్టం మీద అదుపులోకి తెచ్చారు. అయితే వారిద్దరికి ఇది వరకే పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ వారి మధ్య గొడవకు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. బాధితురాలు తీవ్రంగా గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

జోషీమఠ్ లో 600 ఇళ్లకు పగుళ్లు.. ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం

ఈ వాగ్వాదం మొత్తం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఏసీపీ మనోజ్‌ మాట్లాడుతూ.. మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆమెను హస్పిటల్ కు తరలించామని అన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు

హర్యానాలోని యమునానగర్‌లో ఓ మహిళ కిడ్నాప్ ప్రయత్నం నుండి తృటిలో తప్పించుకున్న కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. ఈ ఘటన కూడా సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మహిళ కేకలు వేసి వారితో పోరాడింది. దీంతో నలుగురు వ్యక్తులు తమ కిడ్నాప్ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అక్కడి నుంచి పారిపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios