Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ డీల్...రాహుల్

కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్డీఏ ప్రభుత్వం స్కాంల మయం అని రాహుల్ దుయ్యబుట్టారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. నోట్ల రద్దు కష్టాలు నేటికి దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. 

Hope you are convincing Anil Ambani, PM for JPC on Rafale: Rahul to Jaitley
Author
Delhi, First Published Aug 30, 2018, 6:23 PM IST

ఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్డీఏ ప్రభుత్వం స్కాంల మయం అని రాహుల్ దుయ్యబుట్టారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. నోట్ల రద్దు కష్టాలు నేటికి దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. 

నోట్ల రద్దు కేవలం బడాబాబుల కోసమేనని ఆరోపించారు. 15 మంది పారిశ్రామిక వేత్తల కోసమే నోట్ల రద్దు అని మండిపడ్డారు. నోట్ల రద్దు వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వ్యాపారులకు, సామాన్యులకు, యువతకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకే నోట్ల రద్దు అసలు ప్లాన్ అన్నారు. గుజరాత్ కో ఆపరేటివ్ బ్యాంకులో 700 కోట్లు నగదు మార్పిడి జరిగిందన్నారు. 

మరోవైపు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ డీల్ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. రక్షణ శాఖ మంత్రికి తెలియకుండా రాఫెల్ డీల్ జరిగిందన్నారు. రాఫెల్ స్కాంపై అనిల్ అంబానీ ఎన్ని దావాలు వేస్తారో వేసుకోవచ్చు అన్నారు. 

రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం భయపడుతోందన్నారు. 24 గంటల్లోగా జేపీసీపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సవాల్ విసిరానని అయినా స్పందన లేదన్నారు. రాఫెల్ ఒప్పందంపై తాను అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్నజైట్లీ జేపీసీ ఏర్పాటుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios