Asianet News TeluguAsianet News Telugu

Blackmail: బెంగళూరులో రాత్రిపూట దారుణాలు.. ఢీకొట్టి, బెదిరించి డబ్బు వసూలు చేసే గ్యాంగ్‌లు.. ఎక్స్‌లో చర్చ

బెంగళూరులోని కొన్ని ఏరియాల్లో రాత్రి పది దాటితే అరాచకమే ఏర్పడుతున్నది. కొందరు ముఠాలు టెకీలను, ఎక్కువ సంపాదించేవారిని టార్గెట్ చేసుకుని వారి కార్లను ఛేజ్ చేసి ఒక ఫేక్ యాక్సిడెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత వారిని భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నారు. ఇటీవలే తన భార్యకు ఎదురైన ఓ భయానక అనుభవాన్ని ఒక ఎక్స్ యూజర్ ఆ వేదిక మీద షేర్ చేసుకున్నాడు.
 

hooligans blackmail with fake accident to extort money from people in car, experience shared in X platform
Author
First Published Nov 16, 2023, 4:26 PM IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు పాజిటివ్ వార్తలతో చాలా సార్లు చర్చలో ఉన్నది. కానీ, ఈ ఐటీ నగరంలో బయటకు ఎక్కువగా కనిపించని దారుణాలు జరుగుతున్నాయి. బిజీ బిజీగా కనిపించే ఈ నగరంలో కొన్ని స్థానిక ముఠాలు సంపన్నులుగా కనిపించేవారిని టార్గెట్ చేసుకుని డబ్బు గుంజుతున్నారు. ఉదాహరణకు సర్జాపూర్ ఏరియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారి మోడస్ ఆపరండీ ఏమిటంటే?.. రాత్రి 10 దాటిన తర్వాత రోడ్డుపై వెళ్లుతున్న కార్లను టార్గెట్ చేసుకుంటారు. ఆ కారును ఢీకొడతారు. ఒక ఫేక్  యాక్సిడెంట్‌తో గొడవ మొదలు పెడతారు. వెంటనే కారు నుంచి బయటకు రప్పిస్తారు. ఆ గ్యాంగ్ సభ్యులంతా జమ కూడా వారిని బెదిరిస్తారు. డబ్బు గుంజుతారు.

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్‌లో పోస్టు చేశాడు. శ్రీజన్ ఆర్ శెట్టి.. తన పోస్టులో ఆందోళనకర వివరాలను వెల్లడించాడు. ‘ఒక కన్నడ భాష మాట్లాడే పురుషుడిగా బెంగళూరులో నాకు ఎప్పుడూ అభద్రత అనిపించలేదు. కానీ, రాత్రి 10 దాటిన తర్వాత బెంగళూరులోని కొన్ని ప్రాంతాలు ఎంత అసురక్షితమైనవో గత గురువారం నాకు తెలిసింది. సర్జాపూర్‌లో కొందరు గూండాలు ఫేక్ యాక్సిడెంట్లతో కారులోని ప్రయాణికులను ఎంతటి భయకంపితులు చేసి డబ్బులు వసూలు చేసుకుంటారో కొన్ని వీడియోలు నేను చూసి ఉన్నాను.

నవంబర్ 8వ తేదీన నా భార్య ఆమె కొలీగ్స్ (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు)ను డ్రాప్ చేయాలని అనుకుంది. ఆ రాత్రిపూట సర్జాపూర్ నుంచి క్యాబ్ దొరకడం అప్పుడు కష్టమే. వారంతా ప్రయాణిస్తుండగా.. కొందరు వారి కారును కొన్ని కిలోమీటర్లు ఛేజ్ చేశారు. అయితే.. ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించింది. కారును మెయిన్‌రోడ్డుకు తీసుకవచ్చి ఆపింది. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేసింది.

Also Read: Crime News: బిజినెస్‌మ్యాన్ ఇంట్లో చోరీ.. ఒంటరిగా ఉన్న భార్యపై గ్యాంగ్ రేప్.. సిగరెట్లతో కాల్చిన శాడిస్టులు

కారును ఛేజ్ చేసిన వారంతా వాహనం చుట్టూ గుమిగూడి వెంటనే కారు దిగాలని వారిని డిమాండ్ చేశారు. వారిని ఛేజ్ చేస్తున్న సమయంలో వారి వాహనాలు డ్యామేజీ అయ్యాయని వారు అరిచారు. కానీ, నా భార్య వారి డిమాండ్లను పట్టించుకోలేదు. కారు నుంచి కిందికి దిగలేదు. ఇంకో టెంపో వెనుక నుంచి వచ్చి కారును ఢీకొట్టింది. ఆ టెంపో డ్రైవర్లు కూడా దిగి ఆ గ్యాంగ్‌తో కలిసిపోయారు. అక్కడే ఉన్నవారెవరూ కారులోని వారికి అండగా నిలబడటానికి ముందుకు రాలేదు. 

నా భార్య వెంటనే పోలీసులకు, నాకు, మరో పది మంది మిత్రులకు ఫోన్ చేసి ఆమె షేర్ చేసిన లొకేషన్‌కు రావాలని చెప్పింది. మేం ఆ సమయానికి అక్కడికి వెళ్లకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి’ అని శెట్టి పోస్టులో వివరించాడు.

ఆ తర్వాత అనేక మంది ఇతరులూ వారికి ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ ఏరియాల్లో లైట్లు ఎక్కువగా ఉంచాలని, షాపులను ఎక్కువగా ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇస్తే మనుషుల రాకపోకలు పెరిగి ఈ దారుణాలు తగ్గిపోవచ్చని చర్చించారు. 112కు కాల్ చేసిన తర్వాత పోలీసులు 20 నిమిషాల్లో వచ్చారని, కానీ, ఫోన్ చేసిన తర్వాత రక్షణ పొందడం కాదు.. ఇలాంటి పరిస్థితులు లేకుండా చేయాలి కదా.. అని శెట్టి మరో కామెంట్‌లో పేర్కొన్నాడు. ఓ పోలీసు అధికారి కూడా వివరాలు అడిగాడు. దీపావళి తర్వాత వివరాలతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్టు శెట్టి మరో వ్యక్తికి సమాధానం ఇస్తూ చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios