Crime News: బిజినెస్‌మ్యాన్ ఇంట్లో చోరీ.. ఒంటరిగా ఉన్న భార్యపై గ్యాంగ్ రేప్.. సిగరెట్లతో కాల్చిన శాడిస్టులు

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యాపారి ఇంట్లో ఐదుగురు దొంగలు పడ్డారు. వారు నగలు, డబ్బులు ఎత్తుకెళ్లడంతోపాటు ఇంట్లో ఇంటరిగా ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ భార్యపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు.
 

businessman robbed, his wife gangraped and tortured with cigarette butts in uttarpradesh kms

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ బిజినెస్ మ్యాన్ ఇంటిలో ఐదుగురు దొంగలు పడ్డారు. విలువైన వస్తువులను, డబ్బును సేకరించారు. అదే సమయంలో ఇంట్లో ఆ వ్యాపారి భార్య ఒక్కరే ఉన్నారు. దొంగతనం చేయడంతోపాటు వారంతా ఆమెపైనా కర్కశంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెను తాళ్లతో కట్టేసి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. సిగరెట్ల మొనలతో ఆమె చర్మంపై కాల్చారు. ఈ ఘటన యూపీలోని బిజ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆ బిజినెస్‌మ్యాన్ తన తల్లి, పిల్లలతో కలిసి చికిత్స కోసం ఓ వైద్యుడి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వ్యాపారి భార్య ఒక్కరే ఉన్నారు. ఆ దొంగలు మద్యం మత్తులో ఉన్నారు. ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ. 1.5 లక్షల నగదును పట్టుకున్నారు. అలాగే.. ఓ స్కూటర్, ఎల్‌ఈడీ టీవీని కూడా వారు పట్టుకుని వెళ్లడానికి సిద్ధం చేసుకున్నారు. అల్మారా, ఇతర గదుల తాళాలను కట్ చేసి ఈ దొంగతనానికి తెరలేపారు.

వ్యాపారి భార్యకూ మత్తు ఇచ్చారు. ఆమెను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత దొంగలు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, ఆ వస్తువులను అన్నింటిని పట్టుకుని పారిపోయారు. 

Also Read: అంగస్తంభనల కోసం వాటికి షాక్ థెరపీ.. 45 ఏళ్ల వయసులో ఆ మిలియనీర్ చేసే ప్రయోగాలివే

సదరు బిజినెస్ మ్యాన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు అందించాడు. కానీ, పోలీసులు కేసు నమోదు చేయకుండా ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ, మీడియాలోనూ ఈ ఘటన గురించి వివరాలు రావడంతో కేసు ఫైల్ చేసినట్టు సమాచారం.

అక్టోబర్ 19వ తేదీన కూడా ఓసారి దొంగలు పడ్డట్టు ఆ వ్యాపారి చెప్పారు. అప్పుడు తనను నిర్బంధించి రూ. 80 వేలు లూటీ చేశారని ఆరోపించారు. అప్పుడు కూడా పోలీసులకు చెబితే చర్యలు తీసుకుంటామని గాలికి వదిలేశారని అన్నారు. 

ఇప్పుడు చోరీ, గ్యాంగ్ రేప్ కింద కేసులు నమోదు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios