కూతురు వేరే కులం వ్యక్తితో ప్రేమలో పడిందని దారుణంగా హతమార్చాడో తండ్రి. ఆ తరువాత బంధువు సహాయంతో అంత్యక్రియలు చేశాడు. 

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నతండ్రి అల్లారు ముద్దుగా కని, పెంచిన కూతురి పట్ల కాల యముడిగా మారాడు. పరువు పేరుతో కన్న కూతురి ఊపిరి తీశాడు. ఆదివారం నాడు ఈ పరువు హత్య ఘటన వెలుగు చూసి, జిల్లాలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..

కోలారు తాలూకా తొట్లి గ్రామానికి చెందిన రమ్య (19)అనే యువతి హత్యకు గురైంది. ఆమె అదే గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ అనే వ్యక్తి కుమార్తె. ఆమె ఇంటర్ చదువుకుంటుంది. అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన ఓ యువకుడితో రమ్య ప్రేమలో పడింది.ఈ విషయం ఇంట్లో తెలిసింది. దీంతో తండ్రి వెంకటేశ గౌడ తీవ్ర కోపానికి వచ్చాడు. కూతురిని తీవ్రంగా మందలించాడు. 

మధురై ట్రైన్ ఫైర్ : అగ్ని ప్రమాదం జరిగిన కోచ్ లో భారీగా నోట్ల కట్టలు.. ఎక్కడివంటే....

అయితే కూతురు రమ్య మాత్రం తండ్రి చెప్పిన మాట వినలేదు. అది అతనికి ఆగ్రహావేశాలను కల్పించింది. దీంతో ఈనెల 25వ తేదీ రాత్రి రమ్యను హత్య చేశాడు వెంకటేశ గౌడ. ఆ తరువాత తెల్లవారగానే కూతురు చనిపోయిందంటూ బంధువులతో కలిసి అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు.

అప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని అమ్మాయి.. ఎలాంటి అనుకోని ప్రమాదం బారిన కానీ పడని అమ్మాయి ఒక్కసారిగా మృతి చెందడంతో గ్రామంలో అనుమానాలు తలెత్తాయి. దీంతో పలు ఊహాగానాలు మొదలవడంతో అవి చివరికి పోలీసులకు చేరాయి. దీంతో కోలారు రూరల్ పోలీసులు రమ్య తండ్రి వెంకటేశగౌడను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. 

కూతురి మృతి విషయంలోప్రశ్నించారు. రమ్య తండ్రి రమేష్ గౌడ పోలీసుల విచారణలో కూతుర్ని తానే హత్య చేసినట్లుగా బయటపెట్టాడు. దీంతో తహసిల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో రూరల్ పోలీసులు రమ్య మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించడానికి నిర్ణయించారు. రమ్య మృతదేహానికి తహసిల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో పోస్టుమార్టం చేశారు.

నేరం ఒప్పుకోవడంతో వెంకటేశ గౌడను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన అతని సమీప బంధువు చౌడగౌడను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరి మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.