Asianet News TeluguAsianet News Telugu

యువతిని దారుణంగా దాడి చేసిన వ్యక్తి ఇల్లు బుల్‌డోజర్‌తో నేలమట్టం.. దాడి వీడియో వైరల్ తర్వాత యాక్షన్

మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు ఓ యువతిని దారుణంగా దాడి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆగ్రహించి ఆ యువతిని దారుణంగా కొట్టాడు. ఆ వీడియోలోని యువకుడి ఇంటిని ఈ రోజు రెవా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నేలమట్టం చేసింది.
 

home of man who thrashes teen for refusing marry in a viral video razed with bulldozer in madhya pradesh
Author
First Published Dec 25, 2022, 8:58 PM IST

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని ఓ యువతిపై 24 ఏళ్ల యువకుడు దారుణంగా దాడి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ యువకుడి ఇల్లును రెవా జిల్లా అడ్మినిస్ట్రేషన్ బుల్‌డోజర్‌తో నేలమట్టం చేసింది. వైరల్ వీడియోలో యువతిపై దాడి చేసిన యువకుడి ఇంటిని కూల్చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో రెవా జిల్లాకు చెందిన పంకజ్ త్రిపాఠి 19 ఏళ్ల యువతిని కొట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదిస్తే.. అందుకు యువతి తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు యువతిని దారుణంగా కొట్టాడు. ఆమెను చెంపపై గట్టిగా కొట్టి తలను నేలకేసి బాదాడు. నేలపై పడిపోయిన ఆ యువతి తలపై కాలితో దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె తీవ్రంగా గాయపడి సరిగ్గా నిలబడలేని పరిస్థితికి వెళ్లింది. 

ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని దాడికి ముందే రికార్డింగ్ ఆపేయాలని ఆదేశించాడు. కానీ, అతడు వీడియో తీశాడు. ఆమె కొన్ని గంటలపాటు రోడ్డు పక్కన అలాగే పడి ఉండిపోయింది. స్థానికులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read: మధ్య ప్రదేశ్ లో ఘోరం... ప్రియురాలిని క్రూరంగా చితకబాదిన దుర్మార్గుడు (వీడియో)

త్రిపాఠిని యూపీలోని మీర్జాపూర్‌లో శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు రెవా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అతని ఇంటికి బుల్‌డోజర్‌ పంపింది. అతడి ఇల్లు పూర్తిగా నేలమట్టం చేశారు. అప్పటి వరకు ఆ మెషీన్‌కు, వర్కర్లకు మద్దతుగా పెద్ద మొత్తంలో పోలీసులు అక్కడే నిలబడ్డారు.

త్రిపాఠి డ్రైవర్. డ్రైవింగ్ ఆధారంగానే జీవిస్తున్నాడు. ఇప్పుడు అతడి లైసెన్స్‌ను రద్దు చేశారు. త్రిపాఠిపై సకాలంలో చర్యలు తీసుకోని కారణంగా ఓ స్థానిక పోలీసును కూడా సస్పెండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios