Asianet News TeluguAsianet News Telugu

#Ayodhya Verdict ఢిల్లీలో అమిత్ షా అత్యవసర సమావేశం

వివాదాస్ప రామజన్మభూమి వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్న స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు

Home Minister Amit Shah calls high-level meeting over Ayodhya verdict
Author
New Delhi, First Published Nov 9, 2019, 4:05 PM IST

వివాదాస్ప రామజన్మభూమి వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్న స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అంతకుముందు సుప్రీంతీర్పును అమిత్ షా స్వాగతించారు. రామజన్మభూమి వివాదాస్పద స్థలంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుప్రీం తీర్పును గౌరవించాలని.. ఏక్ భారత్-శ్రేష్ట భారత్‌కి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ వివాదంపై న్యాయబద్ధమైన పరిష్కారం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 

అయోధ్య వివాదంపై  సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Also Read:Ayodhya verdict: జడ్జీలకు చీఫ్ జస్టిస్ గోగోయ్ విందు

బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై  శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.

మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడ కొట్టేసిన సుప్రీం కోర్టు. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లించదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖాళీ ప్రదేశం బాబ్రీ మసీదును కట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది.

Also Read:వరల్డ్ టాప్-10 ట్విట్టర్ ట్రెండ్స్‌లో #Ayodhya Verdict

శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios