న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. మరోసారి అనారోగ్యం బారిన పడడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో అమిత్ షా ఎయిమ్స్ లోని కార్డియో న్యూరో టవర్ లో చేరారు. 

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అమిత్ షా శ్వాస సబంధమైన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా ఆయన పోస్ట్ కోవిడ్ చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరారు. ఆగస్టు 31 తేదీన డిశ్చార్జి అయ్ాయరు. 

ఆగస్టు 2వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో అమిత్ షథా గురుగ్రామ్ లోని వేదాంత ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత ఆగస్టు 14వ తేదీన ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. తిరిగి 4 రోజుల తర్వాత ఆగస్టు 18వ తేదీన పోస్ట్ కోవిడ్ కేర్ కోసం ఎయిమ్స్ లో చేరారు.