ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదిన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ తనయుడు సయ్యద్ షకీల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు నిధుల సేకరణ, సరఫరా చేస్తున్నాడన్న అభియోగంపై షకీల్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.

ఇతనిపై నిఘా పెట్టిన ఎన్ఐఏ.. సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసుల సాయంతో శ్రీనగర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది. షేర్ ఏ కశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో షకీల్ లేబోరేటరీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. సయ్యద్ మరో కుమారుడు సయ్యద్ షాహీద్ యూసఫ్‌ను గతేడాది అక్టోబర్‌లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.