కరుడు కట్టిన రౌడీ షీటర్ దురై మురగన్ ఎన్ కౌంటర్
కరుడు గట్టిన రౌడీ షీటర్ దురై మురుగన్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో శుక్రవారం సాయంత్రం అతను హతమయ్యాడు. దోపిడీలు చేయడం అలవాటున్న మురుగన్ పలు కేసుల్లో నిందితుడు.
చెన్నై: కరుడు గట్టిన రౌడీ షీటర్ దురై మురుగన్ ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కూటంపులి గ్రామంలో 39 ఏళ్ల వి. దురై మురుగన్ పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఈ సంఘటన శుక్రపారంనాడు జరిగింది. Durai Murugan మీద 35 కేసులున్నాయి. వాటిలో నాలుగు హత్య కేసులు కూడా ఉన్నాయి.
దురై మురుగున్ గతవారం టెంకసీ జిల్లాలో ఓ వ్యక్తిని చంపి శవాన్ని తిరునెల్వేలీలో పాతిపెట్టాడని, మురుగున్ ఈ కేసులో ప్రథమ ముద్దాయి అని, దాంతో దురై మురుగన్ ను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని తూత్తుకుడి పోలీసు సూపరిండెంట్ ఎస్ జెయకుమార్ చెప్పారు.
Also Read: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అంటే అర్ధం తెలియదు: సిర్పూర్కర్ కమిషన్‌తో సజ్జనార్
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.... పొట్టకల్కాడు ముత్తయ్యపురం గ్రామంలో దాక్కున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు అయితే, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కానిస్టేబుల్ మీద, ఎస్సైపై దురై మురుగన్ దాడి చేశాడు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
దురై మురుగన్ కు దోపిడీలు చేయడం అలవాటు. దోపిడీల సమయాల్లో హత్యలకు పాల్పడ్డాడు. వ్య్కతును చంపి శవాలను నిర్మానుష్యమైన ప్రదేశాల్లో పాతిపెడుతుంటాడు. టెంకసీకి చెందిన జగదీషన్ ను, ముదురైకి చెందిన మనిమొజిని, తూత్తుకుడికి చెందిన టి. సెల్వంను హత్య చేయడానికి కూడా అదే పద్ధతిని మురుగున్ పాటించాడు.
Also Read: విశాఖ ఏజెన్సీలో ఎన్కౌంటర్... భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోల మృతి
ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో దురై మురగన్ మరణించాడని Jeyakumar చెప్పారు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారని, అయితే పదునైన ఆయుధంతో ఎస్పైపై, కానిస్టేబుల్ మీద దాడి చేశాడని చెప్పారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారని, దురై మురుగన్ అక్కడికక్కడే మరణించాడని ఆనయ చెప్పారు.