ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకమైన నీలం రంగు జాకెట్ ధరించి పార్లమెంట్‌కు వచ్చి ఆకర్షణగా నిలిచారు. ఈ జాకెట్‌ను ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేయగా వచ్చిన మెటీరియల్‌తో తయారు చేశారు. దీనిని తమిళనాడుకు చెందిన సెంథిల్ శంకర్ తయారు చేశారు.
ప్లాస్టిక్ (పీఈటీ) బాటిళ్ల నుంచి రీసైకిల్ చేసిన మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించి ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌కు వెళ్లేందుకు హాజరైన ఘటన ఇటీవల వార్తల్లో నిలిచింది. గత బుధవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ రాజ్యసభకు వచ్చారు. ఈ సమయంలో లేత నీలం రంగు ‘సద్రి’ జాకెట్ ధరించి కనిపించారు. ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభించేందుకు ఫిబ్రవరి 6న బెంగళూరుకు వచ్చిన సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఈ జాకెట్‌ను ప్రధానికి బహూకరించారు.
దీనిని శ్రీ రెంగా పాలిమర్స్ మేనేజింగ్ పార్టనర్ సెంథిల్ శంకర్ ఏషియానెట్‌కు చెందిన గార్గి చౌదరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన విషయాలను ఆయన పంచుకున్నారు.
Question 1: స్థిరమైన వస్త్రాలను తయారు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
శంకర్ : తాము రీసైకిల్ చేసిన పాలిస్టర్‌ల తయారీదారులం. తాము గడిచిన పదిహేనుళ్లుగా దీనిని తయారు చేస్తున్నాం. పీఈటీ బాటిళ్లను తీసుకుని పాలిస్టర్ ఫైబర్‌లుగా తయారుచేస్తాం. తర్వాత దీనిని ఫైబర్ నూలుగా, అనంతరం ఫాబ్రిక్, వస్త్రాలుగా మార్చుతాం. తమ ఆలోచనను భారతదేశమంతా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. బ్రాండ్‌ను ప్రారంభించడం, అవగాహన పెంచడం, ప్రజలు స్థిరమైన ఫ్యాషన్‌ని స్వీకరించేలా చేయడం మంచి విషయం. ఈ విషయానికి సంబంధించి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలి, మార్పు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ప్రధాని మోడీ ఈ దుస్తులను ధరించడం వల్ల వీటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఎంతోమంది ఎంఎస్ఎంఈ వ్యక్తులకు స్పూర్తిగా నిలిచాడు.
Question 2 : మీరు ఈ జాకెట్‌ను ఎలా తయారు చేసారు? ప్రక్రియ గురించి వివరించండి..?
శంకర్: జనం పీఈటీ బాటిళ్లను పారేసిన తర్వాత, చెత్తను సేకరించేవాళ్లు వాటిని మండిస్‌కు చేరుస్తారు. అక్కడ మా వాళ్లు బాటిళ్లను స్వీకరిస్తారు. అనంతరం వాటిని కంప్రెస్ చేసి చూర్ణంగా మారుస్తాం. తర్వాత ఎండబెట్టడం, కరిగించడం, ఇతర విధానాల ద్వారా ఫైబర్‌లుగా మారుస్తారు. నూలు, ఫ్యాబ్రిక్‌లను సంప్రదాయ వస్త్ర ప్రక్రియలోకి తీసుకొచ్చి కావాల్సిన ఆకృతిలోకి కత్తిరిస్తాం.
Question 3: మీ కంపెనీ ప్రధాని మోడీని ఎలా సంప్రదించింది..?
శంకర్: ఆయనే మమ్మల్ని ఎంచుకున్నారు. ఇండియా ఎనర్జీ వీక్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మమ్మల్ని సంప్రదించింది. దీనికి ముందు , తాము చందన్ రంగులో వున్న అదే జాకెట్‌ను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి అందించగా.. ఆయన దానిని ధరించి చాలా ఇష్టపడ్డాడు. అయితే ఈ దుస్తులు పీఎంవో వరకు చేరడానికి చాలా పర్మిషన్‌లు , ప్రోటోకాల్ వంటి ఇబ్బందులు అవరోధంగా నిలిచాయి. తాము పలు ఫ్యాబ్రిక్, పలు రంగులను అధికారులకు పంపించాము. పలు రకాల పరీక్షల అనంతరం .. చివరికి ప్రధాని మోడీ నీలం రంగును ఎంచుకున్నారు. అనంతరం బెంగళూరులో ఐఓసీఎల్ ఛైర్మన్... ప్రధాని మోడీకి జాకెట్‌ను బహూకరించారు.
తాను సిబ్బందితో సమావేశంలో వుండగా.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు దీనికి సంబంధించిన వీడియోలను తనకు పంపించారు. దానిని ధరించి ప్రధాని మోడీ పార్లమెంట్‌కు వెళ్లగా అది వైరల్ అయ్యింది. ఇది తమకు గొప్ప అనుభూతిని కలిగించింది. ప్రధాని.. కారణంగా ఎంఎస్ఎంఈ కంపెనీల గొప్పతనం బయటి ప్రపంచానికి తెలిసింది. మోడీ జాకెట్‌ను ధరించి మమ్మల్ని ప్రోత్సహించాడు.
Question 4: భారతదేశంలో ప్లాస్టిక్ సినారియాతో ఎలా వ్యవహరిస్తారు..?
శంకర్ : ప్లాస్టిక్ పలు రకాల్లో అందుబాటులో వుంది. వాటిని పాక్షికంగా మాత్రమే తొలగించగలం . అయినప్పటికీ నిత్య జీవితంలో ప్లాస్టిక్ మనకు అవసరం. అలాగే వాటిని సరైన విధానంలో నిర్మూలించాలి. పౌరులుగా.. వ్యర్ధాలను వేరు చేయడం, పారవేయడం మన బాధ్యత కాదు. ఈ పని చెత్త ఏరుకునేవాళ్లపై వదిలేస్తాం. కానీ రీ సైక్లింగ్ చేయగల సదుపాయం వున్నప్పుడు ప్లాస్టిక్‌ను ఎలా విసిరేస్తాం. రీ సైక్లింగ్ ఇండస్ట్రీకి ప్రజలతో పాటు ప్రభుత్వ ప్రోత్సహాం కూడా వుండాలి.
Question 5: మీ భవిష్యత్ ప్రాజెక్ట్‌లు
శంకర్: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో కలిసి పనిచేస్తున్నాం. ఇంకా రిటైల్ అమ్మకాల గురించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. sustainable garmentsను భారతదేశమంతటా వ్యాప్తి చేయాలనే ఆలోచన వుంది.
